News June 4, 2024

జగ్గంపేట, ముమ్మడివరం, అమలాపురంలో టీడీపీ హవా

image

AP: జగ్గంపేటలో టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రు 3550 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ముమ్మడివరం, అమలాపురంలో టీడీపీ అభ్యర్థులు దాట్ల సుబ్బరాజు, అయితాబత్తుల ముందంజలో ఉన్నారు.

Similar News

News November 24, 2025

ఐబొమ్మ రవిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏమన్నారంటే?

image

TG: ఐబొమ్మ రవి రాబిన్‌హుడ్ హీరో అని ప్రజలు అనుకుంటున్నారని జడ్చర్ల MLA అనిరుధ్ అన్నారు. టికెట్ ధరలు పెంచి దోచుకోవడం తప్పనే భావనలో వారు ఉన్నారని తెలిపారు. ‘₹1000 కోట్లు పెట్టి తీస్తే బాగుపడేది హీరో, డైరెక్టర్, నిర్మాత అని, ₹50-100Cr పెట్టి తీయలేరా అని ప్రశ్నిస్తున్నారు. తప్పు చేసిన వ్యక్తిని శిక్షించాలని మరికొందరు అంటున్నారు. న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇస్తుందో వేచి చూడాలి’ అని చెప్పారు.

News November 24, 2025

48 గంటల్లో తుఫానుగా మారనున్న వాయుగుండం

image

మలేషియా-అండమాన్‌ సమీపంలో కొనసాగుతున్న అల్పపీడనం క్రమంగా బలపడుతూ వాయుగుండంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. తదుపరి 48 గంటల్లో ఇది దక్షిణ బంగాళాఖాతంలో తుఫానుగా మారవచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. అలాగే ఉపరితల ఆవర్తన ప్రభావంతో రేపు నైరుతి బంగాళాఖాతం-శ్రీలంక సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్లు అధికారులు చెప్పారు.

News November 24, 2025

బంకుల్లో జీరోతో పాటు ఇది కూడా చూడండి

image

వెహికల్స్‌లో పెట్రోల్/ డీజిల్ ఫిల్ చేయిస్తే మెషీన్‌లో 0 చెక్ చేస్తాం కదా. అలాగే ఫ్యూయల్ మెషీన్‌పై ఉండే డెన్సిటీ మీటర్ నంబర్స్ గమనించారా? BIS గైడ్‌లైన్స్ ప్రకారం క్యూబిక్ మీటర్ పెట్రోల్: 720-775 kg/m³ లేదా 0.775 kg/L, డీజిల్: 820 to 860 kg/m³ ఉండాలి. ఇది ఫ్యూయల్ ఎంత క్వాలిటీదో చెప్పే మెజర్‌మెంట్. ఇంజిన్ పర్ఫార్మెన్స్, జర్నీకి ఖర్చయ్యే ఫ్యూయల్‌పై ప్రభావం చూపే డెన్సిటీపై ఇకపై లుక్కేయండి.
Share It