News June 4, 2024

తాడిపత్రిలో టీడీపీ 99 ఓట్ల లీడింగ్

image

AP: అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి 99 ఓట్ల లీడింగులో కొనసాగుతున్నారు. వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి వెనుకంజలో ఉన్నారు. కళ్యాణదుర్గంలో టీడీపీ నేత అమిలినేని సురేంద్రబాబు 3,030 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అక్కడ ఎంపీ తలారి రంగయ్య వెనుకబడ్డారు. జమ్మలమడుగులో 312 ఓట్ల లీడింగులో వైసీపీ నేత సుధీర్ రెడ్డి ఉన్నారు.

Similar News

News November 23, 2025

శ్రీకాకుళం: దైవ దర్శనాలకు వెళ్తూ మృత్యుఒడిలోకి..!

image

మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కొందరు వ్యక్తులు వ్యాన్‌లో దైవ దర్శనాలకు వెళ్తూ <<18364371>>మృత్యుఒడిలోకి<<>> చేరుకున్నారు. కోటబొమ్మాళి మండలం ఎత్తురాళ్లపాడు హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. అయోధ్య, కాశీ, పూరీ వంటి క్షేత్రాలు దర్శించుకున్న అనంతరం శ్రీశైలం మల్లన్న క్షేత్రానికి వెళ్తుండగా ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనలో గాయపడ్డ ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు.

News November 23, 2025

న్యూస్ అప్‌డేట్స్

image

⋆ నేడు పుట్టపర్తిలో సత్యసాయి శత జయంతి ఉత్సవాలు.. పాల్గొననున్న AP CM చంద్రబాబు, తెలంగాణ CM రేవంత్
⋆ నేడు రాప్తాడుకు YCP అధినేత జగన్.. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు రాజశేఖర్ రెడ్డి కుమార్తె వివాహానికి హాజరు
⋆ HYDలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాలు.. సీతాఫల్‌మండి నుంచి చిలకలగూడ వరకు యూనిటీ మార్చ్‌‌లో పాల్గొననున్న కిషన్ రెడ్డి. రాంచందర్ రావు

News November 23, 2025

పశ్చిమ గోదావరి జిల్లాలో ఉద్యోగాలు

image

AP: పశ్చిమగోదావరి డిస్ట్రిక్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్‌మెంట్ ఆఫీస్ 11 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈనెల 29వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, డిగ్రీ (సోషల్ వర్క్, సోషియాలజీ, సోషల్ సైన్సెస్, స్టాటిస్టిక్స్, మ్యాథ్స్), BCA, B.Ed, MSc, MSW ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://westgodavari.ap.gov.in/