News March 20, 2025
ఎస్సీలను ఆదుకుంది TDPనే: చంద్రబాబు

AP: ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం ఇళ్లు ఇచ్చింది ఎన్టీఆరేనని సీఎం చంద్రబాబు తెలిపారు. ఎస్సీలను అన్నివిధాల ఆదుకుంది టీడీపీనేనని అసెంబ్లీలో పేర్కొన్నారు.. ‘దళితులైన బాలయోగిని లోక్‌సభ స్పీకర్, ప్రతిభాభారతిని అసెంబ్లీ స్పీకర్, కాకి మాధవరావును సీఎస్ చేశాం. ఎస్సీల కోసం రూ.8,400 కోట్లతో పథకాలు తీసుకొచ్చాం. ఉగాది నుంచి పీ4 ప్రారంభిస్తాం. వర్గీకరణకు సహకరించిన BJPకి, పవన్ కళ్యాణ్‌కు ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.
Similar News
News March 21, 2025
IPLలోకి ఎంట్రీ ఇస్తోన్న కేన్ మామ

ఐపీఎల్ 2025లో న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ సరికొత్త అవతారం ఎత్తనున్నారు. ఓపెనింగ్ గేమ్ ఆర్సీబీ-కేకేఆర్ మ్యాచుకు ఆయన ఎక్స్‌పర్ట్‌గా వ్యవహరించనున్నారు. కాగా మెగా వేలంలో విలియమ్సన్ అన్‌సోల్డ్‌గా మిగిలారు. రూ.2 కోట్ల కనీస ధరతో ఆయనను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ముందుకు రాలేదు. మరోవైపు PSL డ్రాఫ్ట్‌లోనూ కేన్ మామను ఎవరూ పట్టించుకోలేదు.
News March 21, 2025
BREAKING: పోసానికి బెయిల్ మంజూరు

AP: సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో సినీనటుడు పోసాని కృష్ణమురళికి గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. CID కేసులో ఆయనకు కోర్టు బెయిల్ ఇచ్చింది. త్వరలో ఆయన జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా పోసాని 5 కేసుల్లో అరెస్ట్ అవగా అన్ని కేసుల్లోనూ బెయిల్ లభించింది.
News March 21, 2025
నంది అవార్డులను పునరుద్ధరించాలి: నిర్మాతల మండలి

APలో సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపామని నిర్మాతల మండలి తెలిపింది. విశాఖ, రాజమండ్రి, తిరుపతిలో స్టూడియోలు నిర్మించాలని, నిర్మాతలు, దర్శకులు, టెక్నీషియన్లకు ఇంటి స్థలాలు ఇవ్వాలని కోరామంది. నంది అవార్డులను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేసింది. సినీ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం కృషి చేస్తున్న సీఎం చంద్రబాబు, Dy.CM పవన్, మంత్రులు లోకేశ్, దుర్గేశ్‌కు కృతజ్ఞతలు తెలిపింది.