News March 19, 2024
పిచ్చి వేషాలు వేస్తే టీడీపీనే డిలీట్ చేయాల్సి వస్తుంది: వైసీపీ

AP: టీడీపీకి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి <<12880443>>నోటీసులు<<>> ఇవ్వడంపై వైసీపీ Xలో స్పందించింది. ‘టీడీపీకి ఎన్నికల కమిషన్ మొట్టికాయలు వేసింది. సీఎం జగన్‌ను అవమానించేలా టీడీపీ Xలో పోస్టు వేసింది. ఈసీ నోటీసులు ఇవ్వడంతో లెంపలేసుకుని నిమిషాల్లో పోస్టును డిలీట్ చేసింది. ఇకపై ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే.. పోస్టులు కాదు టీడీపీనే డిలీట్ చేయాల్సి వస్తుంది’ అని హెచ్చరించింది.
Similar News
News February 5, 2026
42 ఏళ్ల పాటు నిరీక్షణ.. 100 ఏళ్ల వృద్ధుడికి దక్కిన న్యాయం

42 ఏళ్ల క్రితం అరెస్ట్ అయిన ఓ వృద్ధుడికి (100 Yrs) ఎట్టకేలకు న్యాయం దక్కింది. 1982లో జరిగిన ఓ హత్య కేసులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న ధనీరామ్‌ను అలహాబాద్ HC నిర్దోషిగా ప్రకటించింది. ఆయన చేసిన అప్పీల్ 4 దశాబ్దాల పాటు పెండింగ్‌లోనే ఉండిపోయింది. ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేయకపోవడం, విచారణలో లోపాలతో పాటు వయసుని పరిగణనలోకి తీసుకుంది. ఈ తీర్పుతో న్యాయవ్యవస్థలో జాప్యంపై చర్చ జరిగే అవకాశం ఉంది.
News February 5, 2026
నేల ద్వారా వ్యాపించే తెగుళ్లు – వాటిని గుర్తించే విధానం

భూమి ద్వారా సంక్రమించే తెగుళ్లు.. విత్తన కుళ్లు, మొలక మాడు, నారు కుళ్లు, వేరు కుళ్లు, మొదలు కుళ్లు, కాండం కుళ్లు, తల కుళ్లు. పంటలో ఈ తెగుళ్లను ముందే గుర్తించేందుకు పొలంలో వేర్వేరు ప్రదేశాల్లో మొక్కలను ఎన్నుకొని, పీకి మెల్లగా మట్టిని తొలగించి శుభ్రం చేయాలి. అప్పుడు వేరు, భూమిలో ఉండే కాండం భాగాల్లో ఏదైనా రంగు మార్పు కనిపిస్తుందేమో చూడాలి. ఏదైనా మార్పు కనిపిస్తే అది వ్యాధి తొలి లక్షణంగా గుర్తించాలి.
News February 5, 2026
అర్ధరాత్రి నుంచి OTTలో ‘రాజాసాబ్’

ప్రభాస్ హీరోగా నటించిన ‘రాజాసాబ్’ సినిమా ఈరోజు అర్ధరాత్రి 12 గంటల నుంచి జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉండనుంది. మారుతి డైరెక్ట్ చేసిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 9న థియేటర్లలో విడుదలైంది. అటు శివకార్తికేయన్, శ్రీలీల తదితరులు నటించిన ‘పరాశక్తి’ మూవీ ఈ నెల 7న జీ5లో విడుదల కానుంది.


