News June 2, 2024

ఫేక్ సర్వేతో టీడీపీ నవ్వులపాలు: YCP

image

APలో ఎన్ని అసెంబ్లీ సీట్లు ఉన్నాయో కూడా తెలియని యాక్సిస్ మై ఇండియా సంస్థ కూటమి గెలుపుపై జోస్యం చెప్పిందని YCP విమర్శించింది. ‘రాజస్థాన్, WB, CH ఎన్నికల్లో ఈ సంస్థ ఇచ్చిన అంచనాలు పూర్తిగా తప్పాయి. బుర్రలేని TDP, ఎల్లో మీడియా ఆ సర్వేపై ఆహా అంటూ కీర్తనలు. ఫేక్ సర్వేలను ఆశ్రయించి పరువు పోగొట్టుకున్న కూటమి’ అని ఎద్దేవా చేసింది. APలో 177 స్థానాలంటూ ఇండియా టుడే ఛానల్‌లో చూపినట్లు ఓ ఫొటోను YCP పంచుకుంది.

Similar News

News October 11, 2024

16 నుంచి ఇంటర్ కాలేజీల టైమింగ్స్ మార్పు

image

AP: ప్రభుత్వ జూనియర్, ఎయిడెడ్ కాలేజీల సమయాల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. ప్రస్తుతం ఉ.9 నుంచి సా.4 వరకు టైమింగ్స్ ఉండగా, ఈ నెల 16 నుంచి సా.5 వరకు సమయాన్ని పొడిగించింది. గత ఏడాది ఫలితాల్లో ఆశించిన స్థాయిలో విద్యార్థులు రాణించకపోవడంతో సా.4-5 గంటల మధ్య స్టడీ అవర్ నిర్వహించాలని ఇంటర్ బోర్డు డైరెక్టర్ కృతిక శుక్ల ఉత్తర్వులిచ్చారు. ఈ మేరకు టైమ్ టేబుల్ సిద్ధం చేసుకోవాలని ప్రిన్సిపల్స్‌ను ఆదేశించారు.

News October 11, 2024

OTTలోకి వచ్చేసిన సూపర్ హిట్ మూవీ

image

శ్రీసింహా, సత్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘మత్తు వదలరా-2’ చిత్రం ఓటీటీలోకి వచ్చింది. అర్ధరాత్రి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. రితీశ్ రాణా దర్శకత్వం వహించిన ఈ మూవీ గత నెల 13న విడుదలైన సూపర్ హిట్‌గా నిలిచింది. కాలభైరవ సంగీతం అందించగా, ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించారు. వెన్నెల కిశోర్, సునీల్, రోహిణి, ఝాన్సీ కీలక పాత్రలు పోషించారు.

News October 11, 2024

ఏపీకి తెలంగాణ విత్తనాలు

image

తెలంగాణ నుంచి ఏపీకి 15వేల క్వింటాళ్ల శనగ విత్తనాలు రానున్నాయి. ప్రస్తుత ఏపీ అవసరాల దృష్ట్యా మంత్రి అచ్చెన్నాయుడి విజ్ఞప్తితో కిలో రూ.90 చొప్పున అమ్మేందుకు TG మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంగీకరించారు. విత్తనోత్పత్తి, ప్రాసెసింగ్, హమాలీ సహా అన్ని ఖర్చులు కలిపి రూ.86 చొప్పున గిట్టుబాటు అవుతుండగా, ఏపీకి ఎగుమతి చేయడంతో కిలో రూ.4 లాభం తెలంగాణ సీడ్ కార్పొరేషన్‌కు లభించనుంది.