News March 29, 2024

నల్లమిల్లి ఇంటికి టీడీపీ నేతలు

image

AP: అనపర్తి ఎమ్మెల్యే టికెట్ కోల్పోయిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి ఇంటికి టీడీపీ నేతలు వెళ్లారు. మాజీ మంత్రి చినరాజప్ప, గోరంట్ల బుచ్చయ్య చౌదరి వద్ద నల్లమిల్లి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. వైసీపీ వాళ్లు మమ్మల్ని భౌతికంగా అంతమొందించాలని చూస్తే.. టీడీపీ అధిష్ఠానం రాజకీయంగా అంతం చేయాలని చూసిందంటూ రామకృష్ణా రెడ్డి తల్లి వాపోయారు. కాగా పొత్తులో భాగంగా అనపర్తి సీటు బీజేపీకి వెళ్లింది.

Similar News

News October 16, 2025

T20 WCకు అర్హత సాధించిన నేపాల్, ఒమన్

image

భారత్-శ్రీలంకలో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌కు ఇప్పటివరకు 19 దేశాలు క్వాలిఫై అయ్యాయి. తాజాగా నేపాల్, ఒమన్ తమ బెర్తులు ఖరారు చేసుకోగా మరో స్లాట్ ఖాళీగా ఉంది. దాన్ని UAE సొంతం చేసుకునే అవకాశం ఉంది.
జట్లు: భారత్, శ్రీలంక, అఫ్గానిస్థాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, USA, వెస్టిండీస్, ఐర్లాండ్, న్యూజిలాండ్, పాకిస్థాన్, కెనడా, ఇటలీ, నెదర్లాండ్స్, నమీబియా, జింబాబ్వే, నేపాల్, ఒమన్.

News October 16, 2025

న్యూస్ రౌండప్

image

* జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: ఎల్లుండి నామినేషన్ దాఖలు చేయనున్న కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్
* TG: ఆస్ట్రేలియాలో జరిగే ‘ఆస్‌బయోటెక్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ 2025’లో ప్రసంగించనున్న మంత్రి శ్రీధర్ బాబు
* AP: పాఠశాల విద్యాశాఖలో 382 మంది ఉద్యోగులకు అంతర్ జిల్లా బదిలీలకు అనుమతి
* అన్ని ACB కార్యాలయాల్లో CCTV కెమెరాల ఏర్పాటుకు రూ.52.19 లక్షల మంజూరు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

News October 16, 2025

రాత్రిళ్లు పసుపు కలిపిన పాలు తాగుతున్నారా?

image

రోగనిరోధక శక్తిని పెంచేందుకు పసుపు కలిపిన పాలు తాగడం మేలని వైద్యులు చెబుతున్నారు. ఈ పాలను నెలరోజుల పాటు రాత్రిళ్లు తీసుకుంటే ఆరోగ్యకరమని అంటున్నారు. ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా నిరోధిస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఎముకలు, కీళ్లను బలపరచడమే కాకుండా జీర్ణక్రియ సాఫీగా జరిగేలా చేస్తుంది. అంతేకాకుండా రాత్రి పూట ప్రశాంతమైన నిద్రకు ఉపయోగపడుతుంది.