News June 4, 2024
కడపలో వైసీపీకి బిగ్ షాక్

AP: కడప అసెంబ్లీ స్థానంలో టీడీపీ అభ్యర్థి మాధవీరెడ్డి 655 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. డిప్యూటీ సీఎం అంజాద్ బాషా వెనకబడ్డారు. పులివెందులలో సీఎం జగన్ లీడింగులో ఉన్నారు. అటు కడప ఎంపీ స్థానంలో వైసీపీ అభ్యర్థి అవినాశ్ రెడ్డి సైతం వెనుకబడ్డారు. కూటమి అభ్యర్థి భూపేశ్ ప్రస్తుతం ఆధిక్యత కనబరుస్తున్నారు. జగన్ సొంత జిల్లాలో ఇద్దరు వైసీపీ క్యాండిడేట్లు వెనకబడటం వైసీపీకి ఇబ్బందికర పరిణామమే.
Similar News
News January 3, 2026
చెదపురుగులతో పంటకు నష్టం.. నివారణ ఎలా?

వ్యవసాయంలో పంట మొలక నుంచి కోత వరకు అన్ని దశల్లో చెదపురుగుల వల్ల 10 నుంచి 50 శాతం వరకు నష్టం వాటిల్లుతోంది. ఈ పురుగులు పంట మొక్కల వేర్లను, చెట్ల కాండాన్ని ఆశించి లోపలి మెత్తని భాగాన్ని తినడం వల్ల అవి వడలిపోయి, ఎండి చనిపోతుంటాయి. చల్కా ఎర్రమట్టి నేలల్లో, నీటి ఎద్దడి ఉన్న తోటల్లో వీటి ఉద్ధృతి ఎక్కువ. ఏ పంటలకు చెదల ముప్పు ఎక్కువ? వీటిని ఎలా నివారించాలో తెలుసుకునేందుకు <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News January 3, 2026
5వ తేదీ నుంచి స్కూళ్లు, కాలేజీల్లో ఆధార్ క్యాంపులు

AP: ఉన్నత పాఠశాలలు, కాలేజీల్లో ఈ నెల 5 నుంచి ప్రత్యేక ఆధార్ శిబిరాలు జరగనున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాల ఆధ్వర్యంలో 9వ తేదీ వరకు కొనసాగనున్నాయి. రాష్ట్రంలో 10.57 లక్షల మంది 17ఏళ్ల లోపు వారు బయోమెట్రిక్ వివరాలు అప్డేట్ చేసుకోవాల్సి ఉందని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ తెలిపింది. నీట్, JEE పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని క్యాంపుల నిర్వహణకు ప్రాధాన్యమివ్వాలని కలెక్టర్లకు సూచించింది.
News January 3, 2026
పంటల్లో చెదపురుగుల ఉద్ధృతి తగ్గాలంటే..

పంటల్లో చెదపురుగుల ఉద్ధృతి తగ్గాలంటే వేసవిలో లోతు దుక్కులు చేసుకోవాలి. గట్లపై కలుపు లేకుండా చూడాలి. బాగి చివికిన పశువుల ఎరువును వేసి కలియదున్నాలి. పంట మార్పిడి విధానం అనుసరించాలి. పసుపును అంతర పంటగా వేసుకోవాలి. పంట వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించి, తల్లి చెదపురుగును గుర్తించి నాశనం చేయాలి. చెద ఆశించిన మొక్కల మొదళ్లలో లీటర్ నీటికి క్లోరిపైరిఫాస్ 50% EC 2ml కలిపి పిచికారీ చేసి నివారించవచ్చు.


