News June 4, 2024
విజయనగరం ఎంపీ స్థానంలో టీడీపీ ముందంజ

AP: విజయనగరం ఎంపీ స్థానంలో టీడీపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక్కడ వైసీపీ తరఫున బెల్లాన చంద్రశేఖర్ బరిలో నిలిచారు. అటు బొబ్బిలిలో కూడా టీడీపీ ఆధిక్యంలో కొనసాగుతోంది.
Similar News
News February 12, 2026
1,495 సెంటర్లలో ఇంటర్ పరీక్షలు

TG: ఫిబ్రవరి 25 నుంచి మొదలయ్యే ఇంటర్ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,495 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 2న ప్రారంభమైన ఇంటర్ ప్రాక్టికల్స్ నిన్నటితో ముగిశాయి. విధుల్లో అలసత్వం వహించిన 53 ఎగ్జామినర్లను తొలగించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ పరీక్షలకు 3,11,011 జనరల్ కోర్సుల విద్యార్థులు, 90,254 మంది వొకేషనల్ విద్యార్థులు హాజరైనట్లు వివరించారు.
News February 12, 2026
నాస్తికుడి కళ్లు తెరిపించిన రాఘవేంద్ర స్వామి

రాఘవేంద్ర స్వామి మహిమలు అనిర్వచనీయం. ఓసారి వేదమంత్రాలను పరిహసించిన ఓ నాస్తికుడు ఎండు రోకలి చూపి దాన్ని చిగురింపజేయమని సవాలు చేశాడు. స్వామివారు చిరునవ్వుతో మంత్రజలాన్ని దానిపై చిలకరించాడు. అప్పుడు అందరూ చూస్తుండగానే ఆ ఎండు కర్ర కాస్త పచ్చని ఆకులతో చిగురించింది. ఈ అద్భుతం చూసిన ఆ నాస్తికుడు స్వామివారి పాదాలకు శరణు కోరాడు. ప్రకృతి నియమాలను కూడా భగవంతుని నామం మార్చగలదని ఈ ఘటన నిరూపిస్తుంది.
News February 12, 2026
విండీస్ విజయం.. ఇతర జట్లకు వార్నింగే!

టీ20 క్రికెట్ సంచలనాలకు మారుపేరు. ఈ ఫార్మాట్‌లో వెస్టిండీస్ ప్రదర్శన అద్భుతమని రికార్డులు చెబుతున్నాయి. రెండు సార్లు కప్పు గెలిచిన ఈ జట్టు తమదైన రోజున ఏ టీమ్‌నైనా ఓడించగలదు. T20 WC-2026 ఫేవరెట్‌గా ఉన్న ఇంగ్లండ్‌ను ఓడించి ఇతర జట్లకు అదే హెచ్చరికలు ఇచ్చింది. హోప్, హెట్‌మెయర్, రూథర్‌ఫోర్డ్, పావెల్ వంటి హిట్టర్లు చెలరేగితే WIకు తిరుగుండదు. మరి రానున్న రోజుల్లో ఇంకెన్ని జట్లకు షాక్ ఇస్తుందో చూడాలి.


