News April 20, 2024
కేంద్ర ఎన్నికల కమిషనర్‌కు టీడీపీ లేఖ

AP: కేంద్ర ఎన్నికల కమిషనర్‌కు టీడీపీ నేత కనకమేడల రవీంద్రకుమార్ లేఖ రాశారు. సీఎం జగన్‌పై రాయితో దాడి చేసిన కేసులో బొండా ఉమను ఇరికించేలా కుట్ర చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. విజయవాడ పోలీసుల తీరుపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో ఈసీ వెంటనే జోక్యం చేసుకోవాలని కనకమేడల విజ్ఞప్తి చేశారు.
Similar News
News January 31, 2026
పేద, ధనిక తేడా లేకుండా అందరికీ ₹2.5 లక్షల వరకు ఉచిత వైద్యం: CBN

AP: P4 కింద 500-700 ఫ్యామిలీలను క్లస్టర్‌గా చేస్తే మార్పు వస్తుందని CM చంద్రబాబు సూచించారు. కుప్పంలోని పీ4 బంగారు కుటుంబాలు-మార్గదర్శులతో CM భేటీ అయ్యారు. ‘కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవడంతో పాటు అక్షరాస్యత పెంచాలి. రాష్ట్రంలో త్వరలోనే పేద, ధనిక తేడా లేకుండా అందరికీ ₹2.5L వరకూ ఉచిత వైద్యం అందిస్తాం’ అని చెప్పారు. కుప్పంలోని 3 మండలాలను దత్తత తీసుకున్న MEIL, ADANI, TVS సంస్థల ప్రతినిధులతో మాట్లాడారు.
News January 31, 2026
కూలీ నుంచి గ్రూప్-2 వరకూ.. ‘విజయ’లక్ష్మి స్ఫూర్తి ప్రయాణం

AP: కష్టాలకు ఎదురొడ్డి నిలబడి విజయాన్ని సొంతం చేసుకున్న మహిళ విజయలక్ష్మి. నంద్యాల(D) రుద్రవరం(M) యల్లావత్తుల గ్రామానికి చెందిన ఆమె పగలంతా కూలీ పనులు చేస్తూ, రాత్రి సమయంలో చదువు కొనసాగించారు. పేద కుటుంబ నేపథ్యంతో పాటు ట్రాక్టర్ నడుపుతూ కుటుంబాన్ని పోషించే భర్త ప్రమాదానికి గురి కావడంతో ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. అయినా ఆమె కుంగిపోలేదు. పట్టుదలతో చదివి గ్రూప్-2లో ASOగా ఎంపికయ్యారు.
News January 31, 2026
నాకు ఇచ్చిన నోటీసు అక్రమం.. KCR లేఖ

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో జూబ్లీహిల్స్ ACPకి కేసీఆర్ 6 పేజీల లేఖ రాశారు. ‘నాకు ఇచ్చిన నోటీసు అక్రమం. దాని ద్వారా నా గౌరవానికి భంగం కలిగించారు. ఇంటి గోడకు నోటీసు అంటించడం చట్టవిరుద్ధం. నేను కొన్ని సంవత్సరాలుగా ఎర్రవల్లిలో నివసిస్తున్నా. అక్కడే స్టేట్‌మెంట్ రికార్డ్ చేయాల్సిన బాధ్యత మీపై ఉంది. చట్టపరమైన అభ్యంతరాలున్నా రేపు 3PMకు నందినగర్ నివాసంలో సిట్ విచారణకు హాజరవుతా’ అని లేఖలో పేర్కొన్నారు.


