News May 2, 2024
పోలింగ్ సమయం పెంచాలని ఈసీకి టీడీపీ లేఖ

AP: రాష్ట్రంలో ఎండల తీవ్రత దృష్ట్యా పోలింగ్ సమయాన్ని సా.6 గంటల వరకు పెంచాలని ఈసీని టీడీపీ కోరింది. మధ్యాహ్నం ప్రజలు బయటికి వచ్చే పరిస్థితి లేదని, సమయాల్లో స్వల్ప మార్పులు చేయాలని ఆ పార్టీ సీనియర్ నేత కనకమేడల ఈసీకి లేఖ రాశారు. దీంతో పోలింగ్ పెరిగే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. కాగా ఇప్పటికే పార్టీల వినతి మేరకు తెలంగాణలో పోలింగ్ సమయాన్ని సాయంత్రం 6 గంటల వరకు ఈసీ పెంచింది.
Similar News
News March 11, 2026
గ్యాస్ కొరత.. హోటళ్లకు 2 రోజుల్లో ₹20 కోట్ల నష్టం

TG: రాష్ట్రంలో హోటళ్లపై గ్యాస్ కొరత తీవ్ర ప్రభావం చూపుతోంది. రాష్ట్రంలోని 50 వేల హోటళ్లుండగా రోజూ ₹300 కోట్ల టర్నోవర్ జరుగుతుండగా, 2 రోజుల్లో ₹20 కోట్ల నష్టం జరిగింది. ఇక స్టాక్ సిలిండర్లు 2-3 రోజులకే ఉండటంతో ఈ నష్టం భారీగా పెరగనుందని హోటల్ యాజమాన్యాల ప్రతినిధి వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ క్రమంలోనే వాణిజ్య గ్యాస్ సమస్య పరిష్కారం కోసం కేంద్రంతో మంత్రి ఉత్తమ్ చర్చిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
News March 11, 2026
ప్రియుడితో పోలీస్ స్టేషన్‌కు మోనాలిసా!

కుంభమేళాతో పాపులరైన మోనాలిసా కేరళం పోలీస్ స్టేషన్లో ప్రత్యక్షమయ్యారు. తనకు, ప్రియుడు ఫర్మాన్ ఖాన్‌కు రక్షణ కల్పించాలని తిరువనంతపురంలోని థంపనూర్ పోలీసులను ఆశ్రయించారు. తమ ప్రేమను తల్లిదండ్రులు అంగీకరించలేదని ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె పేరెంట్స్‌ను పిలిచి పోలీసులు నచ్చజెప్పారు. తర్వాత తన ప్రియుడితో మోనాలిసా వెళ్లిపోయారని తెలిపారు. ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఫర్మాన్‌తో ఆమె ఏడాదిన్నరగా ప్రేమలో ఉన్నారు.
News March 11, 2026
గ్యాస్ కొరత.. కాంగ్రెస్ Vs బీజేపీ

గ్యాస్ కొరతపై కాంగ్రెస్, BJP మధ్య ట్వీట్ల వార్ సాగుతోంది. ATMల ముందు(నోట్ల రద్దు), ఆక్సిజన్(కరోనా) కోసం, ఇప్పుడు గ్యాస్ కోసం జనం క్యూలో ఉన్నారని ఫొటోను INC షేర్ చేసింది. దీంతో ప్రపంచ సంక్షోభాన్ని మోదీకి ముడిపెట్టినా కాంగ్రెస్‌కు ఎవరూ ఓటేయరని BJP సపోర్టర్లు కౌంటరిస్తున్నారు. మోదీ అభివృద్ధిని ప్రస్తావిస్తున్నారు. 8PM తర్వాత పెట్రోల్ పంపులు మూసేయాలని కాంగ్రెస్ గతంలో చెప్పిందని గుర్తుచేస్తున్నారు.


