News January 17, 2025

కోటి దాటిన టీడీపీ సభ్యత్వాలు.. లోకేశ్ ట్వీట్

image

AP: TDP సభ్యత్వాలు కోటి దాటినందుకు మంత్రి లోకేశ్ స్పెషల్ ట్వీట్ చేశారు. ‘రికార్డులు సృష్టించాలన్నా, చరిత్ర తిరగరాయాలన్నా టీడీపీ కార్యకర్తలకే సాధ్యం. పీక మీద కత్తి పెట్టి వేరే పార్టీ అధినేతకు జై కొడితే విడిచిపెడతామని చెప్పినా జై చంద్రబాబు, జై టీడీపీ అంటూ ప్రాణత్యాగం చేసిన చంద్రయ్య నాకు ప్రతి క్షణం గుర్తొస్తారు. కార్యకర్తల అభిప్రాయాలను గౌరవించే ఒకే ఒక్క పార్టీ టీడీపీ’ అని ట్వీట్ చేశారు.

Similar News

News January 27, 2026

కరువుకు మామిళ్లు, కాలానికి నేరేళ్లు

image

సాధారణంగా వర్షాలు సరిగా కురవక, ఎండలు ఎక్కువగా ఉండి కరవు పరిస్థితులు ఉన్నప్పుడు మామిడి చెట్లు విపరీతంగా కాస్తాయి. వాతావరణంలో వేడి పెరిగే కొద్దీ మామిడి పండ్ల దిగుబడి, తీపి పెరుగుతాయి. అలాగే వర్షాలు సమృద్ధిగా కురిసి, వాతావరణం చల్లబడినప్పుడు నేరేడు పండ్లు పుష్కలం వస్తాయి. కరవు సమయంలో ఆహారం కోసం మామిడి పండ్లను, వానాకాలంలో ఆరోగ్యానికి మేలు చేసే నేరేడు పండ్లను ప్రకృతి మనకు ప్రసాదిస్తుందని ఈ సామెత అర్థం.

News January 27, 2026

రామకృష్ణ తీర్థం వెనకున్న పురాణ గాథ

image

స్కంద పురాణం ప్రకారం.. పూర్వం రామకృష్ణుడు అనే మహర్షి వేంకటాద్రి పర్వతాలపై కఠోర తపస్సు చేశారు. నిత్య స్నానాదుల కోసం ఈ తీర్థాన్ని నిర్మించుకున్నారు. అక్కడే నివసిస్తూ మహావిష్ణువును ధ్యానించారు. మహర్షి భక్తికి మెచ్చిన స్వామివారు ప్రత్యక్షమై ఆయనకు ముక్తిని ప్రసాదించారు. అందుకే ఈ తీర్థానికి ఆయన పేరొచ్చింది. ఈ ప్రదేశంలో రాముడు, కృష్ణుడి విగ్రహాలుంటాయి. అందుకే దీన్ని ‘రామకృష్ణ తీర్థం’ అంటారని మరో గాథ.

News January 27, 2026

రామకృష్ణ తీర్థం ఎక్కడ, ఎలా ఉంటుందంటే..

image

రామకృష్ణ తీర్థం తిరుమల శ్రీవారి ఆలయానికి సుమారు 10km దూరంలో ఉంటుంది. దట్టమైన శేషాచల అడవుల మధ్య ఉండే ఈ తీర్థాన్ని పవిత్రంగా కొలుస్తారు. యాత్రికులు ముందుగా తిరుమల నుంచి బస్సు/సొంత వాహనాల్లో పాపవినాశనం చేరుకుంటారు. అక్కడి నుంచి సుమారు 6KM దూరంలో ఈ తీర్థం ఉంటుంది. రాళ్లు, రప్పలు, నీటి వాగుల గుండా ట్రెక్కింగ్ చేస్తూ వెళ్తే ఈ పవిత్ర తీర్థం వస్తుంది. ఇది ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా, అతి రమణీయంగా ఉంటుంది.