News October 18, 2024

26 నుంచి టీడీపీ సభ్యత్వ నమోదు: చంద్రబాబు

image

AP: ఈ నెల 26వ తేదీ నుంచి TDP సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడుతున్నట్లు CM చంద్రబాబు తెలిపారు. గతంలో మాదిరి రూ.100 కట్టినవారికి సాధారణ సభ్యత్వం కల్పిస్తామని, ₹లక్ష కట్టిన వారికి శాశ్వత సభ్యత్వం ఇస్తామని వెల్లడించారు. పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి ₹5లక్షల ప్రమాద బీమా కల్పిస్తామని, చనిపోయిన కార్యకర్తకు మట్టి ఖర్చుల కింద అదనంగా ₹10వేలు ఇస్తామని ఆ పార్టీ MLA, MP, MLCలతో జరిగిన భేటీలో వెల్లడించారు.

Similar News

News December 26, 2025

అరటి తోటల్లో కలుపు నివారణ ఎలా?

image

అరటి తోటల్లో కలుపు నివారణ చాలా ముఖ్యం. దీని కోసం హెక్టారుకు 500 లీటర్ల నీటిలో బుటాక్లోర్ 5లీటర్లు లేదా అలాక్లోర్ 2.5లీటర్ లేదా పెండిమెథాలిన్ 2.5లీటర్లలో ఏదో ఒక మందును కలిపి నాటిన తర్వాత మొదటి తడి ఇచ్చి నేల తేమగా ఉన్నప్పుడు సమానంగా పిచికారీ చేయాలి. దీని వల్ల కలుపు మొలవకుండా అరికట్టవచ్చు. 100 మైక్రానుల మందం కలిగిన పాలిథీన్ మల్చింగ్ షీటును నేలపై పరచి ఆ తర్వాత మొక్కనాటితే కలుపు సమస్యను అధిగమించవచ్చు.

News December 26, 2025

ఈ రాత్రి ఢిల్లీకి సీఎం

image

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ రాత్రికి ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు CWC సమావేశంలో పాల్గొననున్నారు. ఎల్లుండి హైకమాండ్ పెద్దలతో భేటీ కానున్నారు. అందులో క్యాబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టులపై చర్చించనున్నట్లు సమాచారం.

News December 26, 2025

NABARD 44 పోస్టులకు నోటిఫికేషన్

image

<>NABARD<<>> 44 కాంట్రాక్ట్ యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు నేటి నుంచి జనవరి 12 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, డిగ్రీ, పీజీ, B.Ed, BBA ఉత్తీర్ణులు అర్హులు. అభ్యర్థుల వయసు 21 నుంచి 30ఏళ్ల మధ్య ఉండాలి. జీతం నెలకు రూ.70వేలు చెల్లిస్తారు. స్క్రీనింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.nabard.org/