News July 3, 2024
టీడీపీ ఎమ్మెల్యే సంచలన ప్రకటన

AP: బాధితులకు న్యాయం చేయలేనప్పుడు తన లాంటి వారు రాజకీయాల్లో అనవసరమని తిరువూరు TDP MLA కొలికపూడి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పదవులు ఎవరికీ శాశ్వతం కాదని ఓ పోస్ట్ పెట్టారు. ‘కంభంపాడులో YCP నేత చెన్నారావుకు అక్కడి అధికారులు ఇన్ని రోజులు వంత పాడారు. నేను అక్రమ భవన కూల్చివేతకు సిద్ధపడటంతో ఇప్పుడు అరెస్ట్ చేపిస్తున్నారు’ అని పేర్కొన్నారు. ఈ ఘటనపై చంద్రబాబు కొలికపూడిని వివరణ కోరారు.
Similar News
News November 19, 2025
బంధంలో సైలెంట్ కిల్లర్

కొంతమంది మాట్లాడకుండా కూడా వేధిస్తుంటారు. దీనినే స్టోన్ వాలింగ్ అంటారు. వీరు ఇతరులతో పెద్దగా మాట్లాడరు. సీరియస్‌గా మాట్లాడుతున్నా కూడా సమాధానం చెప్పకుండా ముభావంగా ఉండడమో, మధ్యలోనే వెళ్లిపోవడమో చేస్తుంటారు. కొందరు అక్కర్లేని విషయాల గురించి ప్రస్తావిస్తుంటారు. కొన్నిసార్లు అసలు విషయం చెప్పకుండా ఆరోపణలు చేస్తుంటారు. ఇలాంటివారు తమ చేష్టలతో జీవిత భాగస్వామికి మానసిక ప్రశాంతత లేకుండా చేస్తారు.
News November 19, 2025
హిడ్మా ఎన్‌కౌంటర్‌లో ఏపీ పోలీసుల సక్సెస్

ఛత్తీస్‌గఢ్‌లో జన్మించిన హిడ్మాకు దక్షిణ బస్తర్ ప్రాంతంలో గట్టి పట్టు ఉండేది. చాలాసార్లు పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్నాడు. ఇతడిని అంతం చేస్తే చాలు మావోయిజం అంతం అవుతుందని పోలీసులు భావించేవారు. కొన్ని నెలలుగా వరుస ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్ సేఫ్ కాదని భావించిన హిడ్మా.. ఏపీవైపు వచ్చాడని తెలుస్తోంది. గత నెల నుంచే అతడిపై నిఘా వేసిన ఏపీ పోలీసులు పక్కా వ్యూహంతో హిడ్మాపై దాడి చేశారు.
News November 19, 2025
తొలి ఆదివాసీ అగ్రనేత హిడ్మాయే!

భద్రతా బలగాల కాల్పుల్లో మృతి చెందిన హిడ్మా ప్రస్థానం ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా ప్రాంతంలో ఆదివాసీ గ్రామ ఆర్గనైజర్‌గా ప్రారంభమైంది. అనంతరం మావోయిస్టుల యాక్షన్ టీమ్ ఇన్‌ఛార్జ్‌గా ఎదిగి, చివరకు కేంద్ర కమిటీకి చేరిన తొలి ఆదివాసీ అగ్రనేతగా నిలిచాడు. భద్రతా బలగాలను తప్పుదారి పట్టించి, దాడులు నిర్వహించడం హిడ్మా స్టైల్. మావోయిస్టుల నిఘా వ్యవస్థతో పాటు హిడ్మాకు ప్రత్యేక వ్యవస్థ ఉండేది.


