News March 25, 2025

డీలిమిటేషన్‌పై TDP MLA కీలక వ్యాఖ్యలు

image

AP: డీలిమిటేషన్‌లో భాగంగా జనాభా పేరుతో సీట్లు తగ్గించడం సరికాదని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. జనాభా విషయంలో దక్షిణాది రాష్ట్రాలు క్రమశిక్షణ పాటించాయని చెప్పారు. ‘సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇదే విషయమై కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు. ఎన్డీఏ భాగస్వాములం కాబట్టి దీనిపై బహిరంగంగా మాట్లాడలేకపోతున్నాం’ అని ఆయన వ్యాఖ్యానించారు.

Similar News

News March 28, 2025

వచ్చే నెల 19నుంచి రాహుల్ గాంధీ అమెరికా పర్యటన

image

లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వచ్చే నెల 19న అమెరికాకు వెళ్లనున్నారు. బ్రౌన్ యూనివర్సిటీని సందర్శించిన అంతరం బోస్టన్‌లోని భారత సంతతి ప్రజలతో ఆయన మమేకమవుతారని తెలుస్తోంది. గత ఏడాది సెప్టెంబరులో ఆయన డల్లాస్‌, వాషింగ్టన్ డీసీలో పర్యటించారు. టెక్సాస్ వర్సిటీలో విద్యార్థులు, అధ్యాపకులతో ముచ్చటించారు.

News March 28, 2025

మా జట్టు ఓపెనర్లపై ఆధారపడలేదు: క్లాసెన్

image

తమ జట్టు ఓపెనర్లపై ఆధారపడదని SRH బ్యాటర్ క్లాసెన్ తెలిపారు. ‘హెడ్, అభిషేక్ మాకు అదిరిపోయే ఆరంభాల్ని ఇస్తున్నారు. అలా అని మేం వారిపైనే ఆధారపడలేదు. మా లైనప్ చూడండి. 8వ నంబర్ బ్యాటర్ వరకూ విధ్వంసకరంగానే ఆడతారు. కాబట్టి ఓపెనర్లు ఎలా ఆడినా సమస్య లేదు. మేం ఆడేదే రిస్కీ ఆట. నిన్నటి మ్యాచ్‌లో ఒకట్రెండు వికెట్లు దురదృష్టవశాత్తూ కోల్పోయాం. లేదంటే ఆ పిచ్‌పై కనీసం 220 స్కోర్ చేయాల్సింది’ అని వివరించారు.

News March 28, 2025

47 మార్కెట్ కమిటీలకు ఛైర్మన్ల ప్రకటన

image

AP: రాష్ట్రంలో మూడో విడత నామినేటెడ్ పదవులను కూటమి ప్రభుత్వం భర్తీ చేసింది. 47 మార్కెట్ కమిటీలకు ఛైర్మన్‌లను ప్రకటించింది. ఇందులో 37 టీడీపీకి, 8 జనసేనకు, రెండు బీజేపీకి దక్కాయి. ఆ కమిటీల్లో 705 మంది సభ్యులను కూడా ప్రభుత్వం నియమించింది. త్వరలోనే మిగిలిన పదవులను భర్తీ చేస్తామని కూటమి అగ్ర నేతలు చెబుతున్నారు.

error: Content is protected !!