News March 18, 2025
క్రిమినల్ కేసుల్లో టీడీపీ ఎమ్మెల్యేలదే అగ్రస్థానం: ADR

దేశంలో క్రిమినల్ కేసులున్న ఎమ్మెల్యేల జాబితాలో టీడీపీ అగ్రస్థానంలో ఉన్నట్లు ADR నివేదిక వెల్లడించింది. 134 మందికిగాను 115 మంది(86%)పై క్రిమినల్ కేసులు, 82 మంది(61%)పై తీవ్రమైన కేసులు ఉన్నట్లు తెలిపింది. ఇక 1,653 మంది బీజేపీ ఎమ్మెల్యేలకుగాను 638 మంది(39%)పై కేసులు ఉన్నట్లు పేర్కొంది. 52 శాతం మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల(339/646)పై, 41% TMC(95/230) ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసులు ఉన్నాయంది.
Similar News
News March 18, 2025
మోదీతో ‘మ్యూజిక్ మ్యాస్ట్రో’ భేటీ

ప్రధాని మోదీతో మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఆయనతో సమావేశం ఎప్పటికీ మర్చిపోలేనిదని మ్యూజిక్ మ్యాస్ట్రో ట్వీట్ చేశారు. ఇటీవల లండన్‌లో తాను నిర్వహించిన ‘సింఫొనీ వాలియంట్’ ఈవెంట్ సహా పలు అంశాలపై చర్చించినట్లు పేర్కొన్నారు. PM ప్రశంసలు, సపోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. కాగా లండన్‌లో వెస్ట్రన్ క్లాసికల్ సింఫొనీ నిర్వహించిన తొలి ఆసియా సంగీత దర్శకుడిగా ఆయన రికార్డు సృష్టించారు.
News March 18, 2025
ఆడబిడ్డకు జన్మనిచ్చిన సీమా హైదర్

పబ్జీ గేమ్ ద్వారా భారతీయ యువకుడితో ప్రేమలో పడి పాకిస్థాన్ నుంచి పారిపోయి వచ్చిన సీమా హైదర్ గుర్తుందా? ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పటికే ఆమెకు నలుగురు పిల్లలుండగా ఇండియాకు వచ్చాక సచిన్‌ను మరోసారి పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ గ్రేటర్ నోయిడాలో నివాసముంటున్నారు. కాగా, ఇవాళ ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చిందని, ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు సీమా హైదర్ న్యాయవాది ఏపీ సింగ్ తెలిపారు.
News March 18, 2025
విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం: గొట్టిపాటి

AP: YCP తప్పిదాలతో నిర్వీర్యమైన వ్యవస్థను గాడిలో పెడుతున్నామని మంత్రి గొట్టిపాటి రవి తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించాలని కొందరు విద్యుత్ ఉద్యోగులు ఆయన్ను కలవగా సానుకూలంగా స్పందించారు. సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని, అన్ని విషయాల్లో ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ప్రకృతి వైపరీత్యాల వేళ విద్యుత్ శాఖ సేవలు వెలకట్టలేనివని ఆ శాఖ బీసీ ఉద్యోగుల సంఘం డైరీ, క్యాలెండర్ ఆవిష్కరించిన సందర్భంగా చెప్పారు.