News June 24, 2024

గ్రూప్-2 మెయిన్స్ వాయిదా వేయాలని TDP ఎమ్మెల్సీల వినతి

image

AP: గ్రూప్-2 మెయిన్స్ ఎగ్జామ్‌ని వాయిదా వేయాలని APPSC సెక్రటరీని TDP MLCలు కోరారు. ఈ మేరకు MLCలు వేపాడ చిరంజీవిరావు, భూమిరెడ్డి రామ్‌గోపాల్ రెడ్డి, కంచర్ల శ్రీకాంత్ వినతిపత్రం అందజేశారు. జులై 28న జరిగే ఈ పరీక్షలకు అభ్యర్థులు ఎదుర్కొనే సవాళ్లను వివరించారు. ముఖ్యంగా కొత్త సిలబస్‌ను సమగ్రంగా అర్థం చేసుకునేందుకు గాను అభ్యర్థులకు మరికొంత సమయం కావాలన్నారు. కాగా మెయిన్స్‌కు 92,250 మంది క్వాలిఫై అయ్యారు.

Similar News

News November 23, 2025

ఉండి: ఆవాస్ సర్వే పరిశీలనలో కలెక్టర్

image

ఉండి రాజులపేటలో జరుగుతున్న ‘ఆవాస్’ సర్వేను కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదివారం క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించారు. గృహ నిర్మాణాలకు అర్హులైన లబ్ధిదారుల గుర్తింపు కోసం గృహ నిర్మాణ శాఖ చేపడుతున్న ఈ సర్వే తీరును ఆమె అడిగి తెలుసుకున్నారు. యాప్ పనితీరు, ఆన్‌లైన్ ప్రక్రియపై వివరాలు అడిగారు. కముజు సూర్యకుమారి అనే లబ్ధిదారుని వివరాలను యాప్ ద్వారా ఆన్‌లైన్ చేస్తున్న విధానాన్ని ఆమె పరిశీలించారు.

News November 23, 2025

రేపు ఏలూరు జిల్లాలో పవన్ పర్యటన

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు రాజమండ్రి ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్న ఆయన రోడ్డు మార్గంలో ద్వారకాతిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురం వెళ్తారు. అక్కడ కొలువుదీరిన శ్రీలక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. పవన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

News November 23, 2025

CM రేసులో నేనూ ఉన్నా: కర్ణాటక హోం మంత్రి

image

కర్ణాటకలో సీఎం మార్పు అంటూ ప్రచారం జరుగుతున్న వేళ ఆ రాష్ట్ర హోం మంత్రి జి.పరమేశ్వర సంచలన వ్యాఖ్యలు చేశారు. దళితుడిని సీఎం చేయాలని డిమాండ్లు వస్తున్నందున తాను కూడా రేసులో ఉన్నానని చెప్పారు. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీతో చర్చించిన తర్వాత ఈ విషయంపై AICC ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. అయితే ఇప్పటివరకు సీఎం మార్పుపై అధిష్ఠానం చర్చించలేదన్నారు.