News June 7, 2024
BRSకు చెక్ పెట్టేందుకు TDP ఎత్తుగడ?

తెలంగాణలో BRS స్థానాన్ని భర్తీ చేసేందుకు TDP ఎత్తుగడలు వేస్తున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల ఓటమితో కారు పార్టీ డీలాపడగా.. తెలంగాణలో బలపడేందుకు చంద్రబాబు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. కార్యకర్తలు TDPతోనే ఉన్నందున BRSలోని కొంతమంది నేతలను తిరిగి పార్టీలోకి రప్పించేందుకు కృషి చేస్తున్నట్లు టాక్. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని TDP నిర్ణయించిన సంగతి తెలిసిందే.
Similar News
News September 12, 2025
AP న్యూస్ రౌండప్

✶ శ్రీశైలం ప్రాజెక్టు, తుంగభద్ర, కాటన్ బ్యారేజ్, గోరకల్లు జలాశయం మరమ్మతులకు రూ.455Cr మంజూరు చేసిన ప్రభుత్వం.. వచ్చే వర్షాకాలం నాటికి పనులు పూర్తి చేస్తామన్న మంత్రి నిమ్మల
✶ డిగ్రీ ప్రవేశాల గడువు 13వ తేదీ వరకు పొడిగింపు
✶ ఈ నెల 15, 16 తేదీల్లో జిల్లా కలెక్టర్ల సదస్సు
✶ ఈడిగ, గౌడ (గమల్ల), కలలీ, గౌండ్ల, శెట్టిబలిజ, శ్రీశయన (సెగిడి) కులాల ముందు గౌడ్ అనే పదాన్ని తొలగిస్తూ ఉత్తర్వులిచ్చిన ప్రభుత్వం
News September 12, 2025
నేడు వైస్ ప్రెసిడెంట్గా రాధాకృష్ణన్ ప్రమాణం

భారత 15వ ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ఇవాళ ఉ.10 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్లో ప్రెసిడెంట్ ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమంలో పీఎం నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, NDA కీలక నేతలు, తెలుగు రాష్ట్రాల గవర్నర్లు పాల్గొననున్నారు. ఈ ప్రోగ్రామ్ కోసం ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్న ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే.
News September 12, 2025
త్వరలో డిగ్రీ, పీజీ కాలేజీల్లో ఫేషియల్ అటెండెన్స్

TG: డిగ్రీ, పీజీ కాలేజీల్లో త్వరలో ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ విధానం అమలు కానుంది. దీనిపై చర్చించేందుకు ఇవాళ అన్ని వర్సిటీల VCలతో హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ సమావేశం నిర్వహించనుంది. స్టూడెంట్స్తో పాటు టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. అన్ని విద్యాసంస్థల్లో ఫేషియల్ అటెండెన్స్ను అమల్లోకి తేవాలని ఇటీవల జరిగిన సమీక్షలో సీఎం రేవంత్ ఆదేశించిన సంగతి తెలిసిందే.