News February 20, 2025
చిన్నారిపై టీడీపీ దుష్ప్రచారం: వైసీపీ

AP: జగన్‌తో సెల్ఫీ దిగిన చిన్నారి దేవికపై TDP దుష్ప్రచారం చేస్తోందని YCP మండిపడుతోంది. అమ్మ ఒడి రాలేదని చెప్పడంపై ట్రోల్స్ చేస్తున్నారంది. ‘బాలిక రవీంద్ర భారతి స్కూల్‌లో చదువుతుంటే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అని, తండ్రి అద్దె ఇంట్లో ఉంటూ షాప్‌లో పనిచేస్తుంటే దానికి యజమాని అని పోస్టులు చేస్తున్నారు. చిన్నారి తల్లి YCP నేత అంటూ ఫేక్ ఫొటోలు షేర్ చేస్తున్నారు. వీరిపై చర్యలు తీసుకోరా?’ అని ప్రశ్నిస్తోంది.
Similar News
News December 26, 2025
VHT: మరో మ్యాచ్ ఆడనున్న కోహ్లీ?

విజయ్ హజారే ట్రోఫీలో ఢిల్లీ తరఫున కోహ్లీ అదరగొడుతున్నా విషయం తెలిసిందే. ఆడిన 2 మ్యాచుల్లో 133, 77 రన్స్ చేశారు. నేషనల్ టీమ్‌లోని ప్లేయర్లంతా డొమెస్టిక్ క్రికెట్‌లో ఏడాదికి కనీసం 2మ్యాచులు ఆడాలని BCCI రూల్ పెట్టింది. అందుకే రోహిత్, కోహ్లీ చెరో రెండు మ్యాచులు ఆడేశారు. కానీ కోహ్లీ మరో మ్యాచ్ కూడా ఆడనున్నట్లు తెలుస్తోంది. జనవరి 6న రైల్వేస్‌తో జరిగే మ్యాచ్‌లోనూ విరాట్ పాల్గొనే అవకాశమున్నట్లు సమాచారం.
News December 26, 2025
లలిత్ మోదీ, మాల్యాలను వెనక్కు రప్పిస్తాం: విదేశాంగ శాఖ

₹వేల కోట్లు కొల్లగొట్టి విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా, <<18653986>>లలిత్ మోదీలను <<>> దేశానికి రప్పించడానికి కట్టుబడి ఉన్నామని కేంద్రం పేర్కొంది. అంతర్జాతీయ చట్టాలు, విదేశీ న్యాయ చిక్కులతో వారిని రప్పించడంలో జాప్యం అవుతున్నట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాతో పేర్కొన్నారు. కాగా లండన్లో లలిత్ మోదీ, విజయ్ మాల్యా పుట్టినరోజు వేడుకల్లో చేసిన కామెంట్స్ వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే.
News December 26, 2025
తెలంగాణ కోసం పోరాడేది BRS మాత్రమే: KCR

TG: కాంగ్రెస్ ఎప్పుడూ తెలంగాణకు ద్రోహమే చేసిందని, రాష్ట్రం కోసం BRS తప్ప ఇతర పార్టీలు పోరాడవని ముఖ్య నేతలతో నిర్వహించిన భేటీలో కేసీఆర్ స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్రోహం, అన్యాయాన్ని అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరిద్దామని సూచించారు. సమావేశాల అనంతరం మూడు జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఆ వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.


