News March 30, 2024
డబ్బున్నోళ్లకే టీడీపీ టికెట్లు: వైవీ సుబ్బారెడ్డి

AP: డబ్బు ఉన్నవారికే TDP చీఫ్ చంద్రబాబు టికెట్లు ఇచ్చారని YCP నేత వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. ‘బీసీలు ఎక్కువగా ఉన్న ఉత్తరాంధ్రలో కూడా టీడీపీ ఓసీలకు టికెట్లు ఇచ్చింది. రూ.కోట్లు కుమ్మరించేవారికే టికెట్లు కట్టబెట్టింది. చంద్రబాబు మోసాలను ప్రజలు గమనిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఆయనకు ప్రజలే బుద్ధి చెబుతారు. బడుగు, బలహీన వర్గాలను చట్టసభలకు పంపేందుకు CM జగన్ కృషి చేస్తున్నారు’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News December 2, 2025
KMR: మక్కల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన డీఎం

తాడ్వాయి మండలం దేమి గ్రామంలోని మక్కల కొనుగోలు కేంద్రాన్ని మార్క్ఫెడ్ డీఎం శశిధర్ రెడ్డి నేడు పరిశీలించారు. కొనుగోలు కేంద్రం వద్ద రైతులతో ఆయన ముఖాముఖి మాట్లాడి, వారికి కల్పించిన సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. రైతుల నుంచి మక్కల కొనుగోలు ప్రక్రియను త్వరగతిన పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సొసైటీ సభ్యులు, రైతులు పాల్గొన్నారు.
News December 2, 2025
నేను కోచ్గా ఉంటే బాధ్యత వహించేవాడిని: రవిశాస్త్రి

సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ను 0-2తో భారత్ కోల్పోవడంపై మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందించారు. ఈ విషయంలో గంభీర్ను ప్రొటెక్ట్ చేయనని అన్నారు. ‘అతడు 100% బాధ్యత వహించాలి. నేను కోచ్గా ఉన్నప్పుడు ఇది జరిగి ఉంటే ఓటమికి మొదటి బాధ్యతను తీసుకునే వాడిని. నిజానికి టీమ్ కూడా అంత ఘోరంగా లేదు. కానీ గువాహటిలో 100-1 నుంచి 130-7కి పడిపోయారు. ఆటగాళ్లు మరింత బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది’ అని పేర్కొన్నారు.
News December 2, 2025
సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాలు

సౌత్ సెంట్రల్ రైల్వే(<


