News October 6, 2024
చిన్నారి మర్డర్‌పై టీడీపీ Vs వైసీపీ

AP: పుంగనూరులో చిన్నారి అస్పియా <<14288103>>మర్డర్<<>> అధికార, విపక్షాల మధ్య రాజకీయ దుమారానికి తెరతీసింది. ఇది ప్రభుత్వ హత్యేనని YCP ఆరోపించింది. ఇప్పటికే బాలిక ఫ్యామిలీని మాజీ మంత్రి పెద్దిరెడ్డి పరామర్శించారు. ఈనెల 9న జగన్ కూడా పుంగనూరుకు వెళ్లనున్నారు. మరోవైపు నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేశామని, బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హోంమంత్రి అనిత చెప్పారు. చిన్నారి తండ్రిని CM చంద్రబాబుతో ఫోన్‌లో మాట్లాడించారు.
Similar News
News March 5, 2025
నేడు SAvsNZ: ఫైనల్‌లో భారత్‌ను ఢీకొట్టేదెవరు?

ఛాంపియన్స్ ట్రోఫీ రెండో సెమీ ఫైనల్‌లో ఇవాళ సౌతాఫ్రికా, న్యూజిలాండ్ తలపడనున్నాయి. రెండు జట్లూ సమతూకంగా ఉండటంతో పోటీ ఆసక్తికరంగా ఉండనుంది. మ.2.30కు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఐసీసీ టోర్నీల్లో చివరి మెట్టులో బోల్తా పడే వీక్‌నెస్‌ను అధిగమించాలని ఈ టీమ్‌లు ఆరాటపడుతున్నాయి. నేటి మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఆదివారం భారత్‌ను ఢీకొట్టనుంది. ఇవాళ ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.
News March 5, 2025
నాపై కేసులను కొట్టేయండి.. హైకోర్టులో పోసాని పిటిషన్లు

AP: తనపై కర్నూలు, పాతపట్నం, విజయవాడ, ఆదోనిలో నమోదైన కేసులను కొట్టేయాలని కోరుతూ పోసాని కృష్ణమురళి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఇవి రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. ‘మతం, జాతి, నివాసం, భాష ఆధారంగా విద్వేషాలను రెచ్చగొట్టేలా నేను వ్యాఖ్యలు చేయనందున BNS సెక్షన్ 196(1) కింద కేసు నమోదు చెల్లదు. నన్ను తప్పుడు కేసుల్లో ఇరికించారు. 41A కింద నోటీసు ఇచ్చి వివరణ మాత్రమే తీసుకోవాలి’ అని కోరారు.
News March 5, 2025
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ

తనకు ఉన్న ‘ఛేజ్ మాస్టర్’ పేరును విరాట్ కోహ్లీ నిలబెట్టుకుంటున్నారు. నిన్న ఆసీస్‌పై 84 రన్స్ చేయడం ద్వారా వన్డేల్లో లక్ష్య ఛేదనలో అత్యంత వేగంగా 8,000 పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించారు. కింగ్ కేవలం 159 ఇన్నింగ్సుల్లోనే 8,063 రన్స్ చేశారు. ఇందులో 28 సెంచరీలుండటం విశేషం. సచిన్ 232 ఇన్నింగ్సుల్లో 8,720 రన్స్‌తో టాప్‌లో ఉండగా, రోహిత్(6,115 పరుగులు) మూడో స్థానంలో ఉన్నారు.