News April 24, 2025

అండమాన్‌లో మున్సిపల్ ఛైర్మన్ పదవి టీడీపీ కైవసం

image

అండమాన్ నికోబార్ దీవుల్లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ సత్తా చాటింది. బీజేపీ మద్దతుతో సౌత్ అండమాన్‌లోని శ్రీవిజయపురం మున్సిపల్ ఛైర్మన్ పదవిని టీడీపీ కైవసం చేసుకుంది. 24 మంది సభ్యులున్న కౌన్సిల్‌లో టీడీపీ 15 ఓట్లు రాబట్టి ఘనవిజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థిపై టీడీపీ అభ్యర్థి సాహుల్ హమీద్‌ గెలుపొందారు.

Similar News

News January 6, 2026

రాష్ట్రంలో 1095 పోస్టులకు నోటిఫికేషన్

image

AP: <>కస్తూర్బా<<>> గాంధీ బాలికల విద్యాలయాల్లో 1095 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హతగల మహిళలు JAN 20 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, ITI, డిప్లొమా, BCom, BSc, BEd, MA ఎడ్యుకేషన్, MPHW, ANM ఉత్తీర్ణులు అర్హులు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఈ పోస్టులను ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేయనున్నారు.

News January 6, 2026

ఏపీలో వేగంగా ఎయిర్‌పోర్టులు!

image

ఏపీలో విమానాశ్రయాల ఏర్పాటు వేగంగా జరుగుతోంది. ఇప్పటికే విశాఖ, విజయవాడ, తిరుపతిలో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులు ఉన్నాయి. రాజమండ్రి, కర్నూలు, కడప, పుట్టపర్తిలో డొమెస్టిక్ విమానాశ్రయాలు ఉన్నాయి. ఇటీవలే విజయవాడ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేశారు. రాజమండ్రిలో పనులు జరుగుతుండగా, భోగాపురంలో పూర్తి కావొచ్చింది. కొత్తగా కుప్పం, దొనకొండ (ప్రకాశం), దగదర్తి (నెల్లూరు)లో ఎయిర్‌పోర్టులకు ప్లాన్ చేస్తున్నారు.

News January 6, 2026

ఉచిత విద్యుత్ కోసం ఏడాదికి రూ.15,946 కోట్లు: భట్టి

image

TG: ఉచిత విద్యుత్ కోసం ఏడాదికి రూ.15,946 కోట్లు సబ్సిడీ రూపంలో ఇస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ట్వీట్ చేశారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ద్వారా 29.23 లక్షల మంది లబ్ధి పొందుతుండగా రూ.13,499 కోట్లు ఖర్చవుతోందన్నారు. ‘గృహజ్యోతి’తో 52.82 లక్షల మందికి బెనెఫిట్ కలుగుతుండగా, రూ.2,086 కోట్లు సబ్సిడీ ఇస్తున్నామని తెలిపారు. సెలూన్లు, లాండ్రీలు, దోబీఘాట్లు, చేనేతకూ సబ్సిడీ అందిస్తున్నామన్నారు.