News January 31, 2025
కడపలో టీడీపీ ‘మహానాడు’
AP: ఈ ఏడాది TDP ‘మహానాడు’ కడపలో నిర్వహించాలని పొలిట్ బ్యూరో సమావేశంలో నిర్ణయించారు. అలాగే గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు సంస్థాగత ఎన్నికలు మహానాడులోపు నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. చంద్రబాబు అధ్యక్షతన నాలుగున్నర గంటల పాటు జరిగిన ఈ భేటీలో YCP చేసిన జిల్లాల పునర్విభజనను సరిదిద్దాలని కూడా చర్చించారు. అటు పద్మభూషణ్ వచ్చిన బాలకృష్ణకు పొలిట్బ్యూరో సభ్యులు అభినందనలు తెలిపారు.
Similar News
News February 1, 2025
TODAY HEADLINES
* మామూలుగా కాదు గట్టిగా కొడతా: KCR
* KCR.. ముందు నువ్వు సరిగ్గా నిలబడు: రేవంత్
* రేవంత్ నిర్ణయాలతో రియల్ ఎస్టేట్ నాశనం: హరీశ్ రావు
* ఈ ఏడాది కడపలో TDP ‘మహానాడు’
* చాలా ఘోరంగా ఓడిపోయాం.. ఒప్పుకోవాలి: అంబటి
* MLC ఎన్నికల తర్వాత DSC నోటిఫికేషన్: CBN
* భారీగా పెరిగిన బంగారం ధరలు
* 4వ T20లో భారత్ గెలుపు.. సిరీస్ కైవసం
* రాష్ట్రపతి ప్రసంగంపై INC, BJP మధ్య పొలిటికల్ వార్
News February 1, 2025
పద్మ అవార్డులపై సీఎం కీలక వ్యాఖ్యలు
తెలంగాణ నుంచి పద్మ అవార్డులు ఇవ్వాలని కేంద్రానికి ఐదుగురి(గద్దర్, గోరటి వెంకన్న, చుక్కా రామయ్య, అందెశ్రీ, జయధీర్ తిరుమలరావు) పేర్లు తాను సిఫార్సు చేసినట్లు CM రేవంత్ తెలిపారు. వాళ్లు తమ పార్టీ వారు కాకపోయినా, సిద్ధాంతపర విభేదాలున్నా ప్రజల్లో ఉండబట్టే పేర్లు పంపామన్నారు. పక్క రాష్ట్రం APకి ఐదు అవార్డులు ఇచ్చారని, వాళ్లకంటే మేం ప్రతిపాదించిన వాళ్లు తక్కువా? అని గద్దర్ జయంతి సభలో CM ప్రశ్నించారు.
News February 1, 2025
ఈ స్కూల్లో ఏడాదికి రూ.27లక్షలు ఫీజు!
ప్రస్తుతం నాణ్యమైన విద్యను పొందాలంటే రూ.లక్షలు ఖర్చు చేయాల్సిందే. నర్సరీ పిల్లలకు సైతం కొందరు రూ.4-5 లక్షలు వసూలు చేస్తున్నారు. UAEలో ఉండే గ్లోబల్ ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ పాఠశాలలో స్టార్టింగ్ ఫీజే రూ.27లక్షలుగా ఉండటం చూసి అంతా షాక్ అవుతున్నారు. కేరళకు చెందిన మరియమ్మ, KS వర్కీ 1968లో UAEలో ఈ విద్యాసంస్థను ప్రారంభించి అమెరికా, ఇండియా, ఇంగ్లండ్కూ విస్తరించారు.