News February 1, 2025

అద్దె, పింఛన్లపై టీడీఎస్, టీసీఎస్ పరిమితి పెంపు

image

అద్దెలపై విధించే TDS వార్షిక పరిమితిని రూ.2.4 లక్షల నుంచి 6 లక్షలకు పెంచుతున్నట్లు నిర్మల తెలిపారు. ఇక పింఛన్ల వడ్డీపై TDS, TCS మినహాయింపును ప్రస్తుతమున్న రూ.50వేల నుంచి రూ.లక్షకు పెంచనున్నట్లు పేర్కొన్నారు. ‘LRSపై ఉన్న TCS పరిమితిని రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచనున్నాం. విద్యాసంబంధిత రుణాల్లో టీసీఎస్‌ను రూ.10 లక్షల వరకూ తొలగించాలని ప్రతిపాదన తీసుకురానున్నాం’ అని స్పష్టం చేశారు.

Similar News

News November 17, 2025

OFFICIAL: ఎల్లుండి అకౌంట్లలోకి రూ.7,000

image

AP: ఈ నెల 19న పీఎం కిసాన్‌తో పాటు అన్నదాత సుఖీభవ స్కీమ్‌నూ అమలు చేయనున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. రెండో విడతలో రాష్ట్ర వాటా రూ.5వేలు, కేంద్రం వాటా రూ.2వేలు కలిపి రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపారు. కడప జిల్లా కమలాపురంలో నిర్వహించే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఈ నిధులను విడుదల చేస్తారన్నారు. మొత్తంగా 46,62,904 మంది రైతులకు రూ.3,077 కోట్ల మేర లబ్ధి చేకూరుతుందని వివరించారు.

News November 17, 2025

‘అన్నదాత సుఖీభవ’.. అచ్చెన్న కీలక ఆదేశాలు

image

AP: ఈ నెల 19న <<18310567>>అన్నదాత సుఖీభవ<<>> పథకం అమలు నేపథ్యంలో అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. ‘అర్హులైన రైతులు చనిపోతే వారి వారసులకు డెత్ మ్యూటేషన్ చేసి ఈ పథకం వర్తించేలా చర్యలు తీసుకోవాలి. NPCIలో ఇన్‌యాక్టివ్‌గా ఉన్న అకౌంట్లను యాక్టివేట్ చేయాలి. ఈ దిశగా రైతులకు అవగాహన కల్పించాలి. అలాగే ఈ స్కీమ్‌కు అర్హత ఉన్న వారు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే విధానాన్ని సులభతరం చేయాలి’ అని సూచించారు.

News November 17, 2025

జగిత్యాల: EVMల గోదాంను తనిఖీ చేసిన కలెక్టర్

image

ధరూర్ క్యాంప్‌లో ఉన్న ఈవీఎంల గోదామును జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బి.సత్యప్రసాద్ సోమవారం తనిఖీ చేశారు. యంత్రాల భద్రత, సీసీ కెమెరాల పనితీరు, సాంకేతిక వ్యవస్థలను ఈ సందర్భంగా ఆయన సమగ్రంగా పరిశీలించారు. గోదాములో ఎలాంటి లోపాలు లేకుండా పటిష్టమైన భద్రత ఉండాలని, నిత్యం పర్యవేక్షణ కొనసాగించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి.ఎస్.లత, ఆర్డీవో మధుసూదన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.