News December 7, 2024
టీ బ్రేక్: ఆసీస్ స్కోర్ 191/4

అడిలైడ్ టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటర్లు నిలకడగా ఆడుతున్నారు. టీ బ్రేక్ సమయానికి 191/4 స్కోర్ చేశారు. క్రీజులో ట్రావిస్ హెడ్(54), మిచెల్ మార్ష్(2) ఉన్నారు. ఖవాజా 13, నాథన్ 39, లబుషేన్ 64, స్టీవ్ స్మిత్ 2 పరుగులకు ఔటయ్యారు. బుమ్రా 3 వికెట్లు, నితీశ్ రెడ్డి ఒక వికెట్ తీశారు. ప్రస్తుతం 11 పరుగుల లీడ్‌లో ఆసీస్ ఉంది.
Similar News
News February 4, 2026
ఇవాళ మేడారంలో తిరుగువారం పండుగ

TG: మేడారం, కన్నేపల్లి ఆలయాల్లో సమ్మక్క-సారలమ్మలకు ఇవాళ తిరుగువారం పండుగ నిర్వహించనున్నారు. మహాజాతర ప్రారంభమైన వారం తర్వాత ఈ పండుగ జరుపుతారు. పూజారులు ఆలయాలను శుద్ధి చేసి, ధూపదీపాలు వెలిగించి నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. తిరుగువారం పండుగ రోజున గిరిజన, గిరిజనేతర భక్తులు అమ్మవార్లను దర్శించి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ పండుగతో మహాజాతర పూజా కార్యక్రమాలు పూర్తికానున్నాయి.
News February 4, 2026
NCERTలో 117 ఉద్యోగాలు

NCERT 117 అకడమిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో PG, M.LSc, NET/SET/SLET, PhD/M.Phil అర్హతతో పాటు అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.1000. ప్రొఫెసర్‌కు నెలకు రూ.1,44,200, అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.1,31,400, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ లైబ్రేరియన్‌కు రూ.57,700 చెల్లిస్తారు. అర్హులు FEB 20 వరకు అప్లై చేయొచ్చు. మరిన్ని వివరాలకు www.ncert.nic.in చూడండి.
News February 4, 2026
క్రికెట్‌లో కొత్త రూల్స్: స్టంపింగ్‌లో బాల్ చేతికి తగిలితే సరిపోదు!

క్రికెట్ రూల్స్‌ను నిర్ణయించే MCC కొన్ని కీలక మార్పులు చేసింది. రనౌట్ లేదా స్టంపింగ్ చేసేటప్పుడు బాల్ కేవలం చేతికి తగిలితే సరిపోదు. దానిపై పూర్తి కంట్రోల్ ఉండాలి. టెస్ట్ క్రికెట్‌లో రోజు చివరి ఓవర్‌లో వికెట్ పడినా సరే ఆ ఓవర్ పూర్తి చేయాల్సిందే. అలాగే బౌలర్ రన్‌అప్ నుంచి కాకుండా బాల్ రిలీజయ్యాక కీపర్ గ్లోవ్స్ స్టంప్స్ వెనక ఉంటే సరిపోతుంది. ఈ మార్పులు అక్టోబర్ 2026 నుంచి అమల్లోకి రానున్నాయి.


