News February 22, 2025
పిల్లలకు ఇవి నేర్పించండి

భారతదేశం ఉన్నత విలువలు, సంప్రదాయాలకు ప్రసిద్ధి. పిల్లలకు వీటిని నేర్పించడం ద్వారా చిన్న వయసు నుంచే దేశ వారసత్వానికి వారు కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇతరులను పలకరించే సమయంలో నమస్కరించడం, చేతులతో ఆహారం తినడం, తినే ముందు ప్రార్థించడం, ప్రకృతిని, పెద్దలను గౌరవించడం, పండుగలు చేసుకోవడం, అతిథులకు మర్యాద చేయడం వంటివి పిల్లలకు తల్లిదండ్రులు నేర్పిస్తే ఉన్నత స్థానానికి తీసుకెళతాయి.
Similar News
News February 22, 2025
BIG BREAKING: రేపటి గ్రూప్-2 పరీక్షలు యథాతథం

AP: గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలపై ఉత్కంఠ వీడింది. షెడ్యూల్ ప్రకారమే రేపు ఎగ్జామ్ యథాతథంగా ఉంటుందని APPSC అధికారికంగా ప్రకటించింది. పరీక్షలు వాయిదా వేయలేమని స్పష్టం చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందున గ్రాడ్యుయేట్లకు ప్రయోజనం కల్పించే నిర్ణయం తీసుకోలేమని తేల్చి చెప్పింది. ఈ మేరకు ప్రభుత్వం రాసిన లేఖకు ఏపీపీఎస్సీ సమాధానం ఇచ్చింది.
News February 22, 2025
రేపు భారత్ ఓడిపోతుంది: IIT బాబా

మహాకుంభమేళాలో ఐఐటీ బాబాగా వైరల్ అయిన అభయ్ సింగ్ రేపు పాకిస్థాన్‌తో మ్యాచులో భారత్ ఓడిపోతుందని అంచనా వేశారు. ‘నేను ఇప్పుడే చెబుతున్నానుగా ఇండియా అస్సలు గెలవదు’ అని ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ‘విరాట్.. ఇంకా చాలా మంది ఉన్నప్పటికీ ఎలా గెలుస్తారో చూద్దాం. అది జరిగి తీరదు’ అని స్పష్టం చేశారు. బాబా కామెంట్లపై టీమ్ ఇండియా ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
News February 22, 2025
హీరో రామ్ పోతినేనితో మంత్రి కందుల భేటీ

టాలీవుడ్ హీరో రామ్ పోతినేనిని ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ షూటింగ్ సెట్‌లో కలిశారు. రాజమండ్రిలో వీరిద్దరూ పలు విషయాలపై చర్చించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను మంత్రి తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. కాగా ‘RAPO22’ మూవీ కోసం రామ్ రాజమండ్రిలో ఉన్నారు. కొద్ది రోజులుగా ఈ సినిమా షూటింగ్ అక్కడి పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఈ విషయం తెలుసుకున్న మినిస్టర్ ఆయనను కలిశారు.