News September 16, 2025

విద్యార్థి తలపై కొట్టిన టీచర్.. విరిగిన పుర్రె ఎముక

image

AP: అల్లరి చేస్తోందని విద్యార్థినిని కొట్టడంతో తలకు తీవ్రగాయమైన ఘటన చిత్తూరు(D) పుంగనూరులోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో జరిగింది. ఆరో తరగతి చదువుతున్న నాగశ్రీ(11)ని ఈ నెల 10న ఓ టీచర్ స్కూల్ బ్యాగ్‌తో కొట్టాడు. తలనొప్పిగా ఉండటంతో పేరెంట్స్ ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా పుర్రె ఎముక చిట్లినట్లుగా పరీక్షల్లో తేలింది. దీంతో స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Similar News

News January 23, 2026

147పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

image

సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ &రీసెర్చ్<>(SAMEER<<>>)లో 147 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే (JAN 25) ఆఖరు తేదీ. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో BE/BTech, ME/MTech, MSc, BSc, డిప్లొమా, ITI ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాతపరీక్ష/ఇంటర్వ్యూ/స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్ష ఫిబ్రవరి 1న నిర్వహించనున్నారు. వెబ్‌సైట్: https://sameer.gov.in/

News January 23, 2026

పూజ చేయడం వెనుక సైంటిఫిక్ రీజన్

image

పూజ భక్తి మాత్రమే కాదు. గొప్ప మానసిక ప్రక్రియ కూడా. పూజలో వాడే గంటల శబ్దం మెదడులోని రెండు భాగాలను ఏకం చేసి ఏకాగ్రతను పెంచుతుంది. దీపపు కాంతి కంటి చూపును మెరుగుపరుస్తుంది. కర్పూరం, ధూపం గాలిలోని సూక్ష్మక్రిములను సంహరించి స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను అందిస్తాయి. మంత్రోచ్ఛారణ తరంగాలు రక్తపోటును తగ్గిస్తాయి. మనసుకు ప్రశాంతతను ఇస్తాయి. పంచేంద్రియాలను ఉత్తేజపరిచి, శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి.

News January 23, 2026

రాహుల్, థరూర్ మధ్య ముదిరిన విభేదాలు?

image

రాహుల్ గాంధీపై శశి థరూర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల కొచ్చిలో జరిగిన సమావేశంలో వేదికపై తన పేరును రాహుల్ కావాలనే ప్రస్తావించలేదని థరూర్ నొచ్చుకున్నట్లు సమాచారం. దీంతో కేరళ ఎన్నికల సన్నద్ధతపై నేడు నిర్వహించనున్న కీలక సమావేశానికి ఆయన డుమ్మా కొట్టనున్నట్లు తెలుస్తోంది. గతంలో PM మోదీని పొగిడారనే కారణంతో పార్టీ నాయకత్వం థరూర్‌ను పక్కన పెడుతోందన్న ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.