News December 9, 2024

నేడు టీచర్‌ MLC ఓట్ల కౌంటింగ్

image

AP: ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్‌ MLC ఉపఎన్నిక ఫలితాలు నేడు వెలువడనున్నాయి. కాకినాడ జేఎన్టీయూలో 14 రౌండ్స్‌లో 9 టేబుల్స్‌పై అధికారులు ఉదయం 8నుంచి ఓట్లను లెక్కించనున్నారు. టీచర్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక బరిలో ఐదుగురు అభ్యర్థులు నిలిచిన విషయం తెలిసిందే. డిసెంబర్‌ 5న ఓటింగ్ జరగ్గా, 15,490 మంది ఓటేశారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో స్పష్టమైన మెజారిటీ రాకపోతే రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

Similar News

News November 27, 2025

SKLM: బూత్ లెవెల్ ఆఫీసర్స్ చేర్పులు, మార్పులు పూర్తి చేయాలి

image

8 నియోజకవర్గాల్లో ఉన్న బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఓటర్ లిస్టులో చేర్పులు, మార్పులు, దిద్దుబాట్లు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో ఆయా నియోజకవర్గాల్లో గల EROలు, AEROలతో మాట్లాడి ఫారం 6,7,8లకు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల సంఘం సూచించిన ప్రక్రియను సకాలంలో పూర్తిచేసి నివేదికలు అందించాలన్నారు.

News November 27, 2025

RED ALERT: ఈ జిల్లాలకు భారీ వర్షసూచన

image

AP: నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని శ్రీలంక తీరంలో తీవ్ర వాయుగుండం తుఫానుగా మారిందని APSDMA వెల్లడించింది. దీనికి ‘దిట్వా’గా పేరు పెట్టారు. దీని ప్రభావంతో శని, ఆది, సోమవారాల్లో దక్షిణ కోస్తా, రాయలసీమలో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురుస్తాయి. ఆదివారం CTR, TPT, NLR, ప్రకాశం, కడప, అన్నమయ్య, సత్యసాయి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది.

News November 27, 2025

శివజ్యోతి ఆధార్ కార్డును టీటీడీ బ్లాక్ చేసిందా?.. క్లారిటీ ఇదే!

image

AP: ప్రముఖ యాంకర్ శివజ్యోతికి TTD షాక్ ఇచ్చిందన్న వార్త తెగ వైరల్ అవుతోంది. ఆమె భవిష్యత్‌లో శ్రీవారిని దర్శించుకోకుండా ఆధార్ కార్డును బ్లాక్ చేసిందని ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో వాస్తవం లేదు. TTD దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. శ్రీవారి ప్రసాదం తీసుకుంటూ ‘కాస్ట్లీ బిచ్చగాళ్లం’ అంటూ <<18363529>>వీడియో<<>> చేయడంతో ఈ దుమారం రేగింది. ఆమె ఆధార్ బ్లాక్ చేయాలని పలువురు కోరారు. కానీ TTD ఆ నిర్ణయం తీసుకోలేదు.