News August 26, 2025
ముగిసిన టీచర్ల ప్రమోషన్ల ప్రక్రియ

TG: రాష్ట్రంలో టీచర్ల పదోన్నతుల ప్రక్రియ పూర్తయింది. 4,454 మంది ఉపాధ్యాయులకు ప్రమోషన్ లభించింది. 880 మంది స్కూల్ అసిస్టెంట్స్, 811 మంది SGTలకు హెడ్ మాస్టర్లుగా, 2,763 మంది SGTలకు స్కూల్ అసిస్టెంట్‌లుగా ప్రభుత్వం పదోన్నతి కల్పించింది.
Similar News
News August 27, 2025
ఎటు వైపు తిరిగి పడుకుంటున్నారు?

ఎడమ వైపు తిరిగి పడుకుంటే ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెబుతున్నారు. దీనివల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. గురుత్వాకర్షణ శక్తి వల్ల శరీరంలోని వ్యర్థాలు, విష పదార్థాలు కుడి నుంచి ఎడమవైపు వెళ్తాయి. పెద్దపేగు పూర్తిగా ఖాళీ అవడం వల్ల పేగులు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే గుండెకు రక్తం సరఫరా బాగా అవుతుంది. ముఖ్యంగా ప్రెగ్నెంట్లు ఎడమ వైపు తిరిగి పడుకుంటే గర్భాశయానికి, పిండానికి రక్త సరఫరా మెరుగవుతుంది.
News August 26, 2025
భూమన తీవ్ర ఆరోపణలు.. ఆ IAS ఎవరు?

AP: వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఓ సీనియర్ IAS అధికారిణిపై చేసిన <<17523215>>కామెంట్స్<<>> చర్చనీయాంశంగా మారాయి. ఆమె అవినీతిలో అనకొండలాంటిదని, TDR బాండ్ల ద్వారా రూ.వందల కోట్లు దోచుకోవాలని ప్రయత్నించిందని ఆరోపించారు. రోజూ ధరించే చీర రూ.లక్షన్నర అని, రూ.50 లక్షల కంటే విలువైన విగ్గులు ఆమెకు 11 ఉన్నాయని వ్యక్తిగతంగానూ విమర్శించారు. రోజుకో విగ్గుతో దర్శనమిస్తారన్నారు. అయితే ఆ అధికారిణి పేరు మాత్రం వెల్లడించలేదు.
News August 26, 2025
ఆ హీరోయిన్ అంటే మా నాన్నకు ఇష్టం: శ్రుతి హాసన్

బెంగాలీ నటి అపర్ణ సేన్ అంటే తన తండ్రి కమల్ హాసన్‌కు ఇష్టం ఉండేదని శృతిహాసన్ తెలిపారు. ‘నాన్న బెంగాలీలో ఒక సినిమా చేశారు. ఆ సమయంలో అపర్ణ సేన్‌తో ప్రేమలో పడ్డారు. ఆమెను ఇంప్రెస్ చేయడానికి బెంగాలీ నేర్చుకున్నారు. నాన్న డైరెక్ట్ చేసిన “హే రామ్” మూవీలో హీరోయిన్ పాత్ర పేరును కూడా అందుకే అపర్ణ సేన్‌గా మార్చారు’ అని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అపర్ణ సేన్ 9 జాతీయ అవార్డులు, 1987లో పద్మశ్రీ అందుకున్నారు.