News June 14, 2024
టీచర్ టూ హోం మినిస్టర్

వంగలపూడి అనిత.. 1984 జనవరి 1న విశాఖ జిల్లా లింగరాజుపాలెంలో జన్మించారు. ఏయూ నుంచి ఎంఏ, ఎంఈడీ పట్టాలు పొంది కొన్నేళ్ల పాటు ప్రభుత్వ టీచర్‌గా పనిచేశారు. 2012లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి 2014లో పాయకరావుపేట నుంచి టీడీపీ MLA అయ్యారు. 2019లో ఓటమి తర్వాత TDP రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టి ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు పొందారు. ఈ ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడంతో ఏకంగా హోంమంత్రి అయ్యారు.
Similar News
News October 31, 2025
ఎవరు గెలిచినా చరిత్రే

WWC <<18154615>>సెమీఫైనల్లో<<>> ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించిన భారత జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. సౌతాఫ్రికాతో టైటిల్ పోరుకు సిద్ధమైంది. నవి ముంబై వేదికగా నవంబర్ 2న ఫైనల్ జరగనుంది. భారత్, సౌతాఫ్రికా జట్లు ఇప్పటివరకు ఒక్కసారి కూడా వరల్డ్ కప్ గెలవలేదు. ఈసారి ఎవరు విజేతగా నిలిచినా అది ఆ జట్టుకు తొలి వరల్డ్‌కప్‌గా చరిత్రలో నిలుస్తుంది.
News October 31, 2025
సర్దార్ పటేల్ ఫ్యామిలీతో మోదీ భేటీ

భారత తొలి ఉపప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ కుటుంబ సభ్యులతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. వారితో సంభాషణ, దేశానికి సర్దార్ పటేల్ చేసిన సేవలను గుర్తు చేసుకోవడం గొప్పగా ఉందని Xలో పేర్కొన్నారు. గుజరాత్‌లోని కేవడియాలో సర్దార్ పటేల్ 150వ జయంతి వేడుకల్లో ఆయనకు నివాళిగా స్పెషల్ కాయిన్, స్టాంప్‌ను మోదీ రిలీజ్ చేశారు. ఈ ప్రాంతంలోనే ప్రపంచంలోనే ఎత్తైన సర్దార్ పటేల్ విగ్రహం(182 మీటర్లు) ఉంది.
News October 31, 2025
వర్డ్ ఆఫ్ ది ఇయర్ తెలుసా?

ఈ ఏడాదికి ‘67’ను వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా ప్రముఖ ఆన్లైన్ డిక్షనరీ వెబ్సైట్ డిక్షనరీ.కామ్ ప్రకటించింది. నంబర్‌ను పదంగా పేర్కొనడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీనికి అర్థం లేదని, నిర్వచించలేమని వెబ్సైట్ స్పష్టం చేసింది. అమెరికన్ ర్యాపర్ స్క్రిల్లా డ్రిల్ <


