News August 2, 2024
టీచర్లు తేనెటీగల్లాంటి వారు: సీఎం రేవంత్

TG: టీచర్ల విషయంలో జోక్యం చేసుకోవాలంటే ఎవరైనా భయపడతారని, వాళ్లు తేనెటీగల్లాంటి వారని CM రేవంత్ అన్నారు. ‘తేనెటీగలు ఎవరి జోలికి పోవు. వాటి మీద ఎవరైనా రాయేస్తే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. టీచర్లు కూడా తమను ఎవరైనా రాయితో కొడితే మూకుమ్మడిగా ఎవరిపనైనా చెబుతారు’ అని CM అన్నారు. టీచర్ల బదిలీల విషయంలోనూ తనను కొందరు హెచ్చరించారని, అయితే వాళ్ల సమస్యను పరిష్కరించాలనే నిర్ణయం తీసుకున్నానన్నారు.
Similar News
News March 4, 2026
ALERT.. ఈ ఇన్సులిన్ వాడకండి: CDSCO

ఇండియాలో షుగర్ పేషంట్లు ఎక్కువగా వాడే ‘Lantus SoloStar’ ఇన్సులిన్ మందుల బ్యాచ్ (NO. 5F0347B) ఒడిశాలో చోరీకి గురైంది. ఈ నేపథ్యంలో డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్త హెచ్చరిక జారీ చేసింది. ఈ ఇన్సులిన్‌ను 2°C నుంచి 8°C మధ్య భద్రపరచాలి. సరైన ఉష్ణోగ్రత లేకపోతే మందు శక్తి కోల్పోయి రోగుల ప్రాణాలకు ముప్పు కలగవచ్చు. మందు కొనే సమయంలో బ్యాచ్ నంబర్ చెక్ చేయాలని అధికారులు సూచించారు. share it
News March 4, 2026
మురికివాడలో టూరిజం.. 2 గం.కు రూ.15,000!

ముంబైలోని ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ ‘ధారవి’ని చూసేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు. వింతగా అనిపించినా.. ఇక్కడి జీవనశైలిని, కుటీర పరిశ్రమలను చూపించేందుకు గైడ్లు ఒక్కో వ్యక్తి నుంచి 2 గంటలకు రూ.15,000 వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా విదేశీయులు ఈ ‘స్లమ్ టూరిజం’పై ఆసక్తి చూపుతున్నారట. పేదరికాన్ని కూడా ఒక వ్యాపారంగా మార్చడంపై నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
News March 4, 2026
భార్యతో విడాకులు.. రూ.250కోట్లు ఆఫర్ చేసిన హీరో విజయ్?

తమిళ నటుడు, TVK అధినేత విజయ్ తన భార్య సంగీతతో విడాకుల వ్యవహారాన్ని సామరస్యంగా పరిష్కరించాలని భావిస్తున్నట్లు సమాచారం. కోర్టు మెట్లు ఎక్కకుండా విజయ్ తన భార్యకు రూ.250 కోట్ల భరణం ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. తన భార్య, ఇద్దరు పిల్లల భవిష్యత్తు కోసం ఈ భారీ మొత్తాన్ని ఆయన ఆఫర్ చేసినట్లు చర్చ జరుగుతోంది. ఈ వ్యక్తిగత విషయాన్ని గోప్యంగా ఉంచాలని విజయ్ నిర్ణయించారని వార్తలొస్తున్నాయి.


