News September 2, 2025

టీచర్లు టెట్ పాస్ అయితేనే..: సుప్రీంకోర్టు

image

ప్రభుత్వ టీచర్లుగా కొనసాగాలన్నా, ప్రమోషన్లు పొందాలన్నా టెట్ తప్పనిసరి అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కనీసం ఐదేళ్లు సర్వీసు ఉన్నవారంతా టెట్ పాస్ కావాల్సిందేనని తెలిపింది. ఇందుకోసం రెండేళ్ల గడువు విధించింది. ఆ లోపు అర్హత సాధించని వారు ఉద్యోగాలు కోల్పోవాల్సిందేనని తేల్చి చెప్పింది. కాగా ఉమ్మడి ఏపీలో 2012లో తొలిసారి టెట్ నిర్వహించారు. అంతకుముందు ఉద్యోగంలో చేరిన 30వేల మందిపై ప్రభావం పడనుంది.

Similar News

News September 2, 2025

వెయిట్‌లిఫ్టింగ్‌తో మహిళలకు ఎన్నో ప్రయోజనాలు

image

మహిళల ఎముకలు, కండరాలు దృఢంగా ఉండాలంటే వెయిట్‌లిఫ్టింగ్ కూడా వ్యాయామంలో భాగం చేసుకోవాలంటున్నారు నిపుణులు. ఇది బోన్స్‌ను హెల్తీగా ఉంచి ఎముకల సాంద్రతను పెంచుతుంది. వెయిట్‌లిఫ్టింగ్‌ తర్వాత శరీరంలో ఆక్సిజన్ వినియోగం పెరిగి వర్కవుట్ తర్వాత కూడా ఫ్యాట్ బర్న్ అవుతుంది. అలాగే వెయిట్ లిఫ్టింగ్ ఎండార్ఫిన్‌ హార్మోన్‌ను విడుదల చేసి మీ మానసిక ఆరోగ్య స్థితిని పెంచుతుంది.

News September 2, 2025

ఇంటర్ అర్హతతో 48 పోస్టులు

image

న్యూఢిల్లీలోని ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్ 48 డేటా ఎంట్రీ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఇంటర్ పాసై, కంప్యూటర్ పరిజ్ఞానం గల అభ్యర్థులు ఈ నెల 4వరకు అప్లై చేసుకోవచ్చు. టైపింగ్ వేగం నిమిషానికి 30 పదాలు టైప్ చేయగలగాలి. అభ్యర్థులను షార్ట్‌లిస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.590. వెబ్‌సెట్: https://icsil.in/

News September 2, 2025

ఇంటర్వ్యూలో ఎలా రాణించాలి?(2/1)

image

గ్రూప్స్, సివిల్స్‌తోపాటు కార్పొరేట్ సెక్టార్‌లో ఉద్యోగార్థులకు ఇంటర్వ్యూ చాలా కీలకం. ఇందులో ఎలా రాణించాలంటే..
* నిటారుగా కూర్చోవాలి. బిగుసుకుపోకూడదు. అదే సమయంలో లెక్కచేయనట్లుగా కనిపించకూడదు.
* మీలో ఆత్మవిశ్వాసం కనిపించాలి. మీ బలాల గురించి చెప్పాలిగానీ బలహీనతల గురించి ప్రస్తావించాల్సిన అవసరం లేదు.
* మీ అనుభవాలు, సామర్థ్యాల గురించి అతిశయోక్తులు చెప్పొద్దు. ఉన్నది ఉన్నట్లుగా చెప్పండి.