News March 7, 2025

త్వరలో టీచర్ల బదిలీల చట్టం: మంత్రి లోకేశ్

image

AP: విద్యావ్యవస్థలో టీచర్లది కీలక పాత్ర అని, వారిపై భారం ఉంటే పనిచేయలేరని మంత్రి లోకేశ్ చెప్పారు. ఉపాధ్యాయులపై ఒత్తిడి లేకుండా చర్యలు తీసుకుంటున్నామని అసెంబ్లీలో తెలిపారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారి టీచర్ల బదిలీల చట్టం తీసుకొస్తున్నామని ప్రకటించారు. చాలా పారదర్శకంగా సీనియారిటీ జాబితాను టీచర్ల ముందు పెడతామని పేర్కొన్నారు. ఏదైనా తప్పులు ఉంటే వెంటనే కరెక్షన్ చేసుకునే అవకాశం కల్పిస్తామన్నారు.

Similar News

News December 2, 2025

గద్వాల జిల్లాలో రెండవ రోజు 205 నామినేషన్లు

image

గద్వాల జిల్లాల్లో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్లు సోమవారం రెండో రోజు కొనసాగింది. రెండో విడతలో మల్దకల్, అయిజ, వడ్డేపల్లి, రాజోలి మండలాల్లోని క్లస్టర్ కేంద్రాల్లో నామినేషన్లు స్వీకరించారు. మొత్తం 74 సర్పంచ్ స్థానాలు ఉండగా 205 నామినేషన్లు వచ్చాయి. 716 వార్డు స్థానాలకు 341 నామినేషన్లు వచ్చినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. రేపు నామినేషన్లకు చివరి రోజు కావడంతో భారీగా వేసే అవకాశం ఉంది.

News December 2, 2025

అలా చేస్తే ప్రేక్షకులు కచ్చితంగా కనెక్ట్ అవుతారు: నాగ చైతన్య

image

సృజనాత్మకమైన కథను ఎంచుకొని నిజాయితీగా నటిస్తే ప్రేక్షకులు కచ్చితంగా కనెక్ట్ అవుతారని తన వెబ్ సిరీస్ ‘దూత’ నిరూపించిందని హీరో నాగ చైతన్య అన్నారు. ‘దూత’ రిలీజై రెండేళ్లైన సందర్భంగా SMలో పోస్ట్ పెట్టారు. ఈ ప్రాజెక్టులో భాగమైన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. అయితే సీజన్-2 ఎప్పుడు అని ఫ్యాన్స్ ప్రశ్నించారు. విక్రమ్ కె.కుమార్ డైరెక్షన్‌లో వచ్చిన దూతలో జర్నలిస్ట్ సాగర్ వర్మ పాత్రలో చైతన్య మెప్పించారు.

News December 2, 2025

ప్రదోషాల గురించి మీకు ఇవి తెలుసా?

image

తెలుగు పంచాంగం ప్రకారం.. ప్రతి పక్షంలో వచ్చే త్రయోదశి తిథిని ప్రదోషం అంటారు. ఆ తిథి ఏ వారంలో వస్తుందో దాన్ని బట్టి ఆ ప్రదోషానికి ప్రత్యేక నామం ఉంటుంది.
త్రయోదశి తిథి ఆదివారం వస్తే రవి ప్రదోషం. సోమవారం వస్తే దాన్ని సోమ ప్రదోషం. మంగళవారం వస్తే భౌమ ప్రదోషం. బుధవారం వస్తే బుధ ప్రదోషం. గురువారం వస్తే గురు ప్రదోషం. శుక్రవారం వస్తే శుక్ర ప్రదోషం. శనివారం వస్తే శని త్రయోదశి అని పిలుస్తారు.