News October 22, 2024
మత మార్పిడి వివాదంలో చిక్కుకున్న టీమ్ఇండియా క్రికెటర్!

క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్ సభ్యత్వాన్ని ముంబై జింఖానా క్లబ్ రద్దు చేసింది. ఆమె తండ్రి ఇవాన్ క్లబ్ ప్రెసిడెన్షియల్ హాల్లో మత మార్పిళ్లను ప్రోత్సహిస్తుండటమే ఇందుకు కారణం. ‘Brother Manuel Ministries’ తరఫున ఆయన 35 ఈవెంట్లు నిర్వహించారని క్లబ్ మెంబర్ శివ మల్హోత్ర అన్నారు. ‘దేశవ్యాప్తంగా కన్వర్షన్స్ గురించి మనకు తెలిసిందే. ఇప్పుడిది మా వద్దే జరిగింది. క్లబ్లో ఇలాంటివి నిషేధం’ అని తెలిపారు.
Similar News
News November 15, 2025
అయ్యప్ప స్వాములకు తప్పక తెలియాల్సిన ప్రాంతం

అయ్యప్ప స్వామితో యుద్ధంలో మహిషి అనే రాక్షసి మొండెం పడిన ప్రదేశాన్ని ‘ఎరుమేలి’ అని అంటారు. దీన్నే ‘కొట్టబడి’ అని పిలుస్తారు. శబరిమల యాత్రలో ఎరుమేలికి చేరుకున్న భక్తులు ‘స్వామి దింతకతోమ్… అయ్యప్ప దింతకతోమ్’ అని ‘పేటత్తుళ్లి’ అనే సాంప్రదాయ నృత్యం చేస్తారు. ఇది మహిషిపై సాధించిన విజయాన్ని గుర్తుచేస్తుంది. ఎరుమేలి అయ్యప్ప భక్తులకు ఓ ముఖ్యమైన ఆరంభ స్థానంగా, పవిత్రమైన ప్రదేశంగా భావిస్తారు. <<-se>>#AyyappaMala<<>>
News November 15, 2025
179 పోస్టులకు నోటిఫికేషన్

సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ (<
News November 15, 2025
ఏపీ న్యూస్ రౌండప్

* విశాఖ CII సదస్సులో WEF సెంటర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్
* పరకామణి కేసు ఫిర్యాదుదారు సతీశ్ మృతిపై దర్యాప్తు ముమ్మరం.. అనంతపురం చేరుకున్న సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్
* గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా ఏపీ అవతరిస్తోందన్న మంత్రి గొట్టిపాటి
* చంద్రబాబుపై నమ్మకం లేక కంపెనీలు పెట్టుబడుల్ని భారీగా తగ్గిస్తున్నాయని YCP విమర్శలు


