News August 26, 2025
టీమ్ ఇండియా క్రికెటర్లకు రూ.200 కోట్ల నష్టం!

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌ను కేంద్రం బ్యాన్ చేయడంతో టీమ్ ఇండియా క్రికెటర్లు రూ.150-200 కోట్లు నష్టపోనున్నారు. డ్రీమ్ 11కు రోహిత్, బుమ్రా, హార్దిక్, కృనాల్, మై 11 సర్కిల్‌కు సిరాజ్, గిల్, జైస్వాల్, MPLకు కోహ్లీ, విన్‌జోకు ధోనీ బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నారు. ఇందుకు గానూ వీరంతా కలిపి ఏడాదికి రూ.150-200 కోట్లు సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ యాప్స్ రద్దు కావడంతో వీరికి ఆ మొత్తం నష్టంగా మారనుంది.
Similar News
News August 26, 2025
గణపతికి ప్రీతికరమైన వంటకాలు ఇవే..!

సర్వకార్యాలను సిద్ధింపజేసే సర్వదేవతా లక్షణ సమన్వితుడు వినాయకుడు. ఈ జగత్తులో తొలి పూజలు అందుకునే విఘ్నేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైన వంటకాలు ఉన్నాయి. వీటిలో ఉండ్రాళ్లు, మోతీచూర్ లడ్డూ, రవ్వ లడ్డూ, చిట్టిముత్యాల లడ్డూ, రవ్వ పూర్ణాలు, పాయసం, రవ్వ పొంగల్, కొబ్బరి అన్నం, కరంజి, పురాస్ పోలీ వంటి వంటకాలను గణేశుడికి సమర్పించవచ్చు. గణపతి వీటిని ఆస్వాదిస్తూ ఎంతో సంతోషిస్తారని ప్రతీతి.
News August 26, 2025
ALERT: రేపు, ఎల్లుండి భారీ వర్షాలు

AP: అల్పపీడనం కారణంగా రాబోయే రెండు రోజులపాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. అల్లూరి, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. గంటకు 40-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.
News August 26, 2025
పేర్ని నానిపై మరో కేసు నమోదు

AP: వైసీపీ నేత పేర్ని నానిపై మరో కేసు నమోదైంది. పోలీసులను కించపరిచే విధంగా మాట్లాడారంటూ ఏలూరు త్రీ టౌన్ పీఎస్‌లో ఆయనపై కేసు నమోదు చేశారు. ఇటీవల దెందులూరు పర్యటనలో విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు స్వామిభక్తితో పనిచేస్తున్నారని, తాము అధికారంలోకి వచ్చాక అన్ని లెక్కలు సరిచేస్తామని హెచ్చరించినట్లు తెలిపారు.