News July 7, 2024

TEAM INDIA: కుర్రాళ్లకు ఆదిలోనే భంగపాటు..!

image

జింబాబ్వేతో తొలి T20లో ఓటమితో టీమ్ ఇండియా కుర్రాళ్లకు ఆదిలోనే భంగపాటు ఎదురైంది. స్వల్ప లక్ష్యమే అయినా అనుభవలేమితో వికెట్లు సమర్పించుకున్నారు. ఫలితంగా T20 WC-2024కు క్వాలిఫై కాని పసికూనపై పరాజయం పాలైంది. దీంతో మేనేజ్‌మెంట్‌ను నెటిజన్లు విమర్శిస్తున్నారు. జట్టులో సీనియర్ ఆటగాళ్లను ఉంచాల్సిందని కామెంట్లు చేస్తున్నారు. సంజూ శాంసన్, అక్షర్ పటేల్ లాంటి సీనియర్ ఆటగాళ్లను ఆడించాల్సిందని వాపోతున్నారు.

Similar News

News October 19, 2025

బ్రౌన్ షుగర్‌తో ఫేస్ మాస్క్

image

బ్రౌన్ షుగర్ అందాన్ని పెంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా చర్మంపై పేరుకున్న మృతకణాలను తొలగించి మెరిసేలా చేస్తుంది. కాస్త బ్రౌన్ షుగర్‌లో పాలు, పెసరపిండి కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. దీన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. దీంతో చర్మంపై ముడతలు, మొటిమలు తగ్గుతాయి. అలాగే బ్రౌన్ షుగర్‌లో బాదం నూనె, జాస్మిన్ ఆయిల్ కలిపి చర్మానికి రాసి, కాసేపటి తర్వాత కడిగేస్తే ముఖం తేమగా ఉంటుంది.

News October 19, 2025

నితీశ్.. ఇక ఆల్ ఫార్మాట్ ప్లేయర్‌

image

తెలుగు ప్లేయర్ నితీశ్‌కుమార్‌ రెడ్డి ఇవాళ వన్డేల్లో అరంగేట్రం చేశారు. AUSతో తొలి వన్డేలో జట్టులో చోటు దక్కించుకున్నారు. ఇప్పటికే టీ20, టెస్టుల్లో అరంగేట్రం చేసిన NKR ఇప్పుడు ఆల్ ఫార్మాట్‌ ప్లేయర్‌గా అవతరించారు. గతేడాది NOV 22న విరాట్ కోహ్లీ నుంచి టెస్ట్ క్యాప్ అందుకోగా తాజాగా రోహిత్ శర్మ చేతులమీదుగా వన్డే క్యాప్ తీసుకున్నారు. ఇవి నితీశ్ కెరీర్‌లో మరిచిపోలేని మూమెంట్స్‌గా మిగిలిపోనున్నాయి.

News October 19, 2025

ఐఐటీ బాంబే 53 పోస్టులకు నోటిఫికేషన్

image

ఐఐటీ బాంబే 53 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హతలు గల అభ్యర్థులు నవంబర్ 7వరకు అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, టెక్నికల్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేటివ్ సూపరింటెండెంట్, అసిస్టెంట్ సెక్యూరిటీ ఇన్‌స్పెక్టర్, Jr మెకానిక్ తదితర పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి వివిధ అర్హతలున్నాయి. వెబ్‌సైట్: https://www.iitb.ac.in/career/apply