News September 10, 2025
వరుస టాస్ ఓటములకు తెరదించిన టీమ్ ఇండియా

టీమ్ ఇండియా ఎట్టకేలకు టాస్ గెలిచింది. ఇవాళ ఆసియా కప్‌లో భాగంగా UAEతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ వరుస టాస్ ఓటములకు తెరదించింది. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి వరుసగా 15 మ్యాచ్‌ల్లో IND టాస్ ఓడిన విషయం తెలిసిందే. 16వ మ్యాచ్‌లో ఈ స్ట్రీక్‌కు బ్రేక్ పడింది. అటు ఇవాళ్టి మ్యాచ్‌లో స్టార్ బౌలర్ అర్ష్‌దీప్‌కు చోటుదక్కలేదు. ముగ్గురు స్పిన్నర్లను ఆడించాలని తనను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.
Similar News
News April 2, 2026
ఢిల్లీ సూపర్ విక్టరీ

IPL-2026: లక్నోతో జరిగిన లో స్కోరింగ్ మ్యాచులో ఢిల్లీ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన LSG 18.4 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఢిల్లీ ఆరంభంలోనే ఓపెనర్లు రాహుల్ (0), నిస్సాంక (1) వికెట్లు కోల్పోయింది. ఈ దశలో సమీర్ రిజ్వీ (70*) కీలక ఇన్నింగ్సుతో తన జట్టును గెలిపించారు. స్టబ్స్ 39* పరుగులతో రాణించారు. మరో 17 బంతులు మిగిలి ఉండగానే అక్షర్ సేన విక్టరీ అందుకుంది.
News April 2, 2026
VDK ‘రణబాలి’ షూటింగ్ సీన్ లీక్

విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘రణబాలి’ నుంచి ఓ సీన్ లీకైంది. ఇది సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అందులో గుర్రంపై వచ్చిన విజయ్ దేవరకొండ రాయలసీమ స్లాంగ్‌లో మాస్ డైలాగులతో అదరగొట్టారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ అనంతపురం జిల్లాలో జరుగుతోంది. రష్మిక హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది సెప్టెంబర్ 11న విడుదల కానుంది.
News April 2, 2026
ట్రంప్ వ్యాఖ్యలు పచ్చి అబద్ధం: ఇరాన్

సీజ్‌ఫైర్ కోసం ఇరాన్ అభ్యర్థించిందన్న <<19538873>>ట్రంప్<<>> వ్యాఖ్యలను ఆ దేశం ఖండించింది. అవన్నీ అబద్ధమని, అందుకు ఎటువంటి ఆధారాలు లేవని ఇరాన్ విదేశాంగ శాఖ తాజాగా స్పష్టం చేసింది. దేశంలో అధికార మార్పిడి జరగలేదని, పాత అధ్యక్షుడే కొనసాగుతున్నారని పేర్కొంటూ ట్రంప్ పోస్ట్‌ను కొట్టిపారేసింది.


