News June 28, 2024
TEAM INDIA: ఇంగ్లండ్‌కూ ఇచ్చిపడేసింది!

రెండేళ్ల కింద జరిగిన ఘోర పరాభవానికి టీమ్ ఇండియా రివేంజ్ తీర్చుకుంది. 2022 టీ20 వరల్డ్ కప్ సెమీస్‌లో 10 వికెట్ల తేడాతో భారత్‌ను ఇంగ్లండ్ చిత్తుగా ఓడించింది. దీంతో టీమ్ ఇండియా అవమానకరరీతిలో ఆ టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. ఆ అవమానానికి ఇప్పుడు ప్రతీకారం తీర్చుకుంది. 68 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించి టోర్నీ నుంచి నిష్క్రమించేలా చేసింది. ఈ విజయంతో భారత ఫ్యాన్స్ తెగ సంతోష పడుతున్నారు.
Similar News
News October 25, 2025
108, 104 సేవల్లో రూ.2 వేలకోట్ల స్కామ్: YCP

AP: 108, 104 సేవలను ప్రభుత్వం డబ్బు సంపాదనకు వాడుకుంటోందని YCP ఆరోపించింది. అంబులెన్స్ సేవల కాంట్రాక్ట్ ఎలాంటి అనుభవంలేని భవ్య హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ Ltdకు అప్పగించడాన్ని తప్పుబట్టింది. TDP నేత డా.పవన్ కుమార్ ఆ సంస్థకు డైరెక్టర్‌గా ఉన్నారని, ఇందులో రూ.2 వేల కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపణలు చేసింది. ఈ కాంట్రాక్ట్‌తో TDP నెలకు రూ.31 కోట్ల మామూళ్లు తీసుకుంటోందని విడదల రజిని ట్వీట్ చేశారు.
News October 25, 2025
జైళ్ల నుంచి ఉగ్ర, హత్య కుట్రలపై కేంద్రం అప్రమత్తం

జైళ్ల నుంచి ఉగ్ర, హత్య కుట్రలు చేస్తున్న టెర్రరిస్టు-గ్యాంగ్‌స్టర్ నెట్‌వర్క్‌ను విచ్ఛిన్నం చేసేలా ప్రణాళికను రూపొందించాలని అన్ని భద్రతా ఏజెన్సీలకు కేంద్ర హోమ్ శాఖ ఆదేశాలిచ్చింది. ఇటీవల జరిగిన కొన్ని హత్యలపై 53చోట్ల NIA చేసిన సోదాల్లో జైళ్ల నుంచి ఆర్గనైజ్డ్ నెట్వర్కు నడుస్తున్నట్లు తేలడంతో చర్యలు చేపట్టింది. రాష్ట్రాల పోలీసుల సహకారంతో అత్యంత ప్రమాదకారుల్ని గుర్తించి వారిని ఇతర జైళ్లకు తరలించనుంది.
News October 25, 2025
‘యుద్ధం చేస్తాం’.. అఫ్గాన్‌కు పాక్ వార్నింగ్

పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ మధ్య ఇస్తాంబుల్‌లో శాంతి చర్చలు ఓ కొలిక్కి రాలేదు. రేపు కూడా ఈ చర్చలు కొనసాగేలా ఉన్నాయి. ఇలాంటి సమయంలో పాక్ డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా మహ్మద్ ఆసిఫ్ యుద్ధం చేస్తామని హెచ్చరించడం సంచలనంగా మారింది. ‘మాకో ఆప్షన్ ఉంది. ఇప్పుడు ఎలాంటి ఒప్పందం జరగకపోతే వారిపై యుద్ధం చేస్తాం. కానీ, వాళ్లు శాంతి కోరుకుంటున్నట్లు కనిపిస్తోంది’ అని ఖవాజా చెప్పినట్లు రాయిటర్స్ పేర్కొంది.


