News August 2, 2024

టీమ్ ఇండియాలో గ్రూపులు లేవు: సూర్య

image

టీమ్‌లో గ్రూపులు లేవని భారత T20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపారు. ‘T20WC ప్రారంభమైనప్పటి నుంచి ప్లేయర్లమంతా ఎప్పుడూ విడివిడిగా కూర్చోలేదు, టీమ్‌గానే ఉంటున్నాం’ అని సూర్య వెల్లడించారు. ఈ వ్యాఖ్యల్ని అజయ్ జడేజా, నెహ్రా తప్పుపట్టారు. గతంలో జట్టుగా కలిసి కూర్చోలేదా? ఇప్పుడే కొత్తగా మొదలుపెట్టినట్లు సూర్య చెబుతున్నారని జడేజా విమర్శించగా, ఈ మార్పునకు ఇంత టైమ్ ఎందుకు పట్టిందని నెహ్రా ప్రశ్నించారు.

Similar News

News November 24, 2025

మీకోసం కాల్ సెంటర్ సేవలు వినియోగించుకోండి: కలెక్టర్

image

జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ కృత్తికా శుక్లా తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం మీ కోసం కాల్ సెంటర్ సేవలను ఉపయోగించుకోవాలని ఆమె ప్రజలకు సూచించారు. అర్జీదారులు తమ ఫిర్యాదులను Meekosam.ap.gov.inలో లేదా 1100 నంబర్‌కు కాల్ చేసి నమోదు చేసుకోవచ్చని కోరారు.

రైతన్న మీకోసం పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

image

ఈనెల 24 నుంచి 30 వరకు నిర్వహించనున్న ‘రైతన్న మీకోసం’ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ మహేశ్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆదివారం అమలాపురంలో కలెక్టరేట్‌లో జరిగిన టెలికాన్ఫరెన్స్‌లో ఆయన అధికారులకు సూచనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలోని అధికారులు సమర్థవంతంగా నిర్వహించి, విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు.