News June 20, 2024

టీమ్ ఇండియా హోమ్ షెడ్యూల్ రిలీజ్

image

2024-25 సంవత్సరానికిగానూ టీమ్ ఇండియా హోమ్ షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది. ఈ ఏడాది స్వదేశంలో మొత్తం 10 టెస్టులు, 6 వన్డేలు, 16 టీ20లు ఆడనుంది. జింబాబ్వేతో 5 టీ20లు, శ్రీలంకతో 3 వన్డేలు, 3 టీ20లు, న్యూజిలాండ్‌తో 3 టెస్టులు, బంగ్లాదేశ్‌తో 2 టెస్టులు, 3 టీ20లు, ఆస్ట్రేలియాతో 5 టెస్టులు, ఇంగ్లండ్‌తో 5 టీ20లు, 3 వన్డేల్లో తలపడనుంది. కాగా బంగ్లాదేశ్‌తో జరిగే మూడో టీ20 హైదరాబాద్‌లో జరగనుంది.

Similar News

News January 8, 2025

జనవరి 08: చరిత్రలో ఈరోజు

image

* 1642: ప్రముఖ భౌగోళిక శాస్త్రజ్ఞుడు, తత్వవేత్త గెలీలియో మరణం.
* 1942: భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ జననం(ఫొటోలో)
* 1962: లియోనార్డో డావిన్సీ అద్భుతసృష్టి ‘మోనాలిసా’ పెయింటింగ్‌ను అమెరికాలో తొలిసారి ప్రదర్శనకు ఉంచారు.
* 1975: మ్యూజిక్ డైరెక్టర్ హ్యారిస్ జైరాజ్ పుట్టినరోజు
* 1983: సినీ హీరో తరుణ్ బర్త్‌డే
* 1987: భారత మాజీ క్రికెటర్ నానా జోషి మరణం

News January 8, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News January 8, 2025

40 ఏళ్ల అనుభవం.. చివరికి ఇస్రో ఛైర్మన్‌గా..

image

ఇస్రో కొత్త <<15093696>>ఛైర్మన్‌గా<<>> నియమితులైన వి.నారాయణన్ ప్రస్తుతం సంస్థలోని లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్(LPSC) డైరెక్టర్‌గా ఉన్నారు. 1984లో ఇస్రోలో చేరిన ఆయన 40 ఏళ్లుగా పలు కీలక స్థానాల్లో పనిచేశారు. నారాయణన్ సారథ్యంలోనే GSLV Mk-3 ద్వారా C25 క్రయోజెనిక్ ప్రాజెక్టు విజయవంతమైంది. అలాగే చంద్రయాన్-2, 3, ఆదిత్య స్పేస్‌క్రాఫ్ట్ మిషన్లకు నారాయణన్ నాయకత్వంలోని బృందమే ప్రొపల్షన్ సిస్టమ్స్‌ను రూపొందించింది.