News October 10, 2024

సెమీస్ రేసులోకి టీమ్ ఇండియా

image

మహిళల టీ20 వరల్డ్ కప్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఘన విజయం సాధించింది. 82 పరుగుల తేడాతో ఆ జట్టును చిత్తు చేసి సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. 173 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన లంక 19.5 ఓవర్లలో 90 పరుగులకే ఆలౌటైంది. ఆ జట్టులో కవిషా దిల్హారి (21), అనుష్క సంజీవని (20) కాసేపు పోరాడారు. తెలుగమ్మాయి అరుంధతి రెడ్డి, ఆశా శోభన చెరో 3 వికెట్లతో లంకేయుల భరతం పట్టారు.

Similar News

News November 2, 2025

ప్రయాణాల్లో వాంతులవుతున్నాయా?

image

ప్ర‌యాణాల్లో వాంతులు అవ‌డం అనేది సాధార‌ణంగా చాలా మంది ఎదుర్కొనే స‌మ‌స్య. వికారంగా అనిపించ‌డం, త‌ల తిర‌గ‌డం, పొట్ట‌లో అసౌకర్యంగా ఉండడం ఇవ‌న్నీ మోష‌న్ సిక్‌నెస్ ల‌క్ష‌ణాలు. దీన్ని తగ్గించాలంటే అల్లం రసం, హెర్బల్ టీ వంటివి తాగాలి. శ్వాస వ్యాయామాలు చేయాలి. నిమ్మకాయ వాసన చూసినా వికారం తగ్గుతుంది. అలాగే ప్రయాణానికి ముందు తేలిగ్గా జీర్ణ‌మ‌య్యే ఆహారం తీసుకోవాలి. హెవీ ఫుడ్స్‌ సమస్యను మరింత పెంచుతాయి.

News November 2, 2025

కీలక వికెట్లు కోల్పోయిన భారత్

image

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టీ20లో భారత్ కీలక వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (25), గిల్ (15), కెప్టెన్ సూర్య (24) ఔటయ్యారు. తిలక్ వర్మ, అక్షర్ పటేల్ క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం టీమ్ ఇండియా స్కోర్ 8 ఓవర్లలో 82/3గా ఉంది. సూర్య సేన విజయానికి మరో 72 బంతుల్లో 105 రన్స్ అవసరం. మరి ఈ మ్యాచులో ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.

News November 2, 2025

సన్నబియ్యంలో కేంద్రం వాటా రూ.42, రాష్ట్రానిది రూ.15: కిషన్ రెడ్డి

image

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్‌కు ఓటు వేయకపోతే సన్నబియ్యం రద్దవుతాయని సీఎం రేవంత్ ప్రజలను బెదిరిస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి బెదిరింపు రాజకీయాలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. దీనిపై ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు. సన్నబియ్యం స్కీమ్ కేంద్రానిదని, కేజీకి మోదీ సర్కారు రూ.42 ఇస్తే, రాష్ట్రం వాటా రూ.15 మాత్రమే అని పేర్కొన్నారు.