News May 31, 2024

USలో టీమ్ ఇండియాకు వసతులు కరవు!

image

టీ20 వరల్డ్ కప్ కోసం అమెరికా వెళ్లిన భారత జట్టుకు వసతులు కరవైనట్లు తెలుస్తోంది. ప్రాక్టీస్ చేయడానికి కూడా కనీస సౌకర్యాలు లేవని సమాచారం. ఈ ఏర్పాట్లపై టీమ్ ఇండియా క్రికెటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు టాక్. దీనిపై ఇప్పటికే ఐసీసీ స్పందించి సౌకర్యాలు కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా భారత్ తన తొలి మ్యాచ్ జూన్ 5న ఐర్లాండ్‌తో ఆడనుంది. అదే నెల 9న పాకిస్థాన్‌తో తలపడనుంది.

Similar News

News April 10, 2026

ధనుష్-కృతి.. మరోసారి జోడీ!

image

ధనుష్, కృతి సనన్ జోడీగా గతేడాది రిలీజైన ‘తేరే ఇష్క్ మే’ మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రానికి ఆనంద్ ఎల్ రాయ్ డైరెక్షన్ చేశారు. ఈ ముగ్గురి కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం. పీరియాడికల్ లవ్ స్టోరీని దర్శకుడు సిద్ధం చేస్తున్నారని టాక్. ఈ ఏడాది చివర్లోనే షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది.

News April 10, 2026

IPL నుంచి హసరంగ ఔట్!

image

LSG స్టార్ స్పిన్నర్ హసరంగ గాయం కారణంగా ఐపీఎల్‌కు దూరమయ్యారు. ఆయన భారత్‌కు రాలేడనే అంచనాతో ఒకట్రెండు రోజుల్లో వేరే ప్లేయర్‌ను తీసుకోనున్నట్లు టీమ్ డైరెక్టర్ టామ్ మూడీ ప్రకటించారు. గతేడాది వేలంలో హసరంగను రూ.2 కోట్లకు LSG కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. గాయంతో బాధపడుతున్న ఆయన శ్రీలంక బోర్డు నుంచి NOC పొందలేదు. హసరంగ స్థానంలో దక్షిణాఫ్రికా స్పిన్నర్ జార్జ్ లిండేను తీసుకునే అవకాశం ఉంది.

News April 10, 2026

ఈ నెలాఖరులోగా ఆస్తి పన్ను చెల్లిస్తే 5 శాతం రాయితీ

image

AP: మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో 2026-27 ఏడాదికి సంబంధించిన ఆస్తి పన్నుపై ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ నెలాఖరులోగా చెల్లిస్తే 5 శాతం రాయితీ ఇస్తామని ప్రకటించింది. అలాగే 2025-26 వరకు ఉన్న ఆస్తి పన్ను బకాయిలపై 50 శాతం వడ్డీ మాఫీ సదుపాయాన్ని ఈ నెలాఖరు వరకు పొడిగించింది. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.