News February 9, 2025
2 వికెట్లు కోల్పోయిన టీమ్ ఇండియా

ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో వన్డేల్లో భారత జట్టు 14 పరుగుల తేడాలో రెండు వికెట్లను కోల్పోయింది. ఓపెనర్ గిల్ 60 పరుగులు చేసి వెనుదిరగగా కోహ్లీ 5 పరుగులకే ఔటయ్యారు. 21 ఓవర్లకు భారత్ స్కోరు 158/2. క్రీజులో రోహిత్(82*), అయ్యర్(6*) ఉన్నారు. విజయానికి ఇంకా 147 పరుగులు చేయాల్సి ఉంది.
Similar News
News November 28, 2025
HYD: కొడుకుతో కలిసి భర్తను చంపిన భార్య

కుమారుడితో కలిసి కట్టుకున్న భర్తనే దారుణ హత్య చేసిందో భార్య. ఈ ఘటన మేడిపల్లి PS పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. బోడుప్పల్ దేవేంద్ర నగర్లో నివసించే బండారి అంజయ్య(55) స్కూల్ బస్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. మద్యానికి బానిసై భార్య, కుమారుడితో నిత్యం గొడవపడేవాడు. గురువారం రాత్రి వివాదం జరగడంతో కుమారుడు, మరొకరితో కలిసి భార్య అతడిని చంపేసింది. కేసు నమోదైంది.
News November 28, 2025
మంచాన్ని గోడలకు ఆనించవచ్చా?

మంచాన్ని గోడకు ఓవైపు మాత్రమే ఆనించి ఉంచాలని, అదే శ్రేయస్కరమని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతున్నారు. మిగిలిన 3 వైపులా వీలైనంత ఖాళీ స్థలం ఉండాలంటున్నారు. ‘మంచంపై నుంచి వ్యక్తులు సులభంగా దిగడానికి, ఎక్కడానికి అనుకూలంగా ఉండాలి. గదిలో ఇరుకు ఉండకుండా, ఏ ఇబ్బంది లేకుండా నడిచేలా స్పేస్ ఉండాలి. దీనివల్ల శక్తి ప్రవాహం పెరుగుతుంది. 3 వైపులా గోడలు ఉంటే నిద్ర నాణ్యత దెబ్బతింటుంది’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>
News November 28, 2025
వింత ఆచారం.. అక్షింతలుగా బియ్యానికి బదులు జొన్నలు

తెలంగాణ వినూత్న ఆచారాలకు నిలయం. ఇక్కడ ప్రాంతాలను బట్టి ఆచారాలు, ఆహారపు అలవాట్లూ మారుతుంటాయి. అలాంటి ఓ ఆచారం ప్రకారం పెళ్లిలో అక్షింతలుగా బియ్యానికి బదులు జొన్నలను వాడటం కొన్నిచోట్ల కనిపిస్తుంది. జొన్నలను కొన్ని వర్గాల ప్రజలు బియ్యం కంటే పవిత్రంగా భావించి అక్షింతలుగా వాడతారట. ఆదిలాబాద్, వికారాబాద్, వెస్ట్ రంగారెడ్డి ప్రాంతాల్లోని పలు చోట్ల ఇది కనిపిస్తుంది. మీ ప్రాంతంలో ఈ ఆచారం ఉందా?COMMENT


