News August 4, 2024
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక

టీమ్ ఇండియాతో జరుగుతున్న రెండో వన్డేలో శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
భారత్: రోహిత్, గిల్, కోహ్లీ, శ్రేయస్, రాహుల్, దూబే, సుందర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్
శ్రీలంక: నిస్సాంక, అవిష్క ఫెర్నాండో, కుశాల్ మెండిస్, సమరవిక్రమ, అసలంక, కమిందు మెండిస్, లియానగే, వెల్లలగే, అకిల ధనంజయ, అసిత ఫెర్నాండో, జెఫ్రీ వాండర్సే
Similar News
News December 31, 2025
ఫిబ్రవరిలో కల్కి-2 షూటింగ్?

రాజాసాబ్ సినిమాతో సంక్రాంతికి ప్రేక్షకులను అలరించేందుకు ప్రభాస్ సిద్ధమవుతున్నారు. తర్వాత కల్కి-2 మూవీ షూటింగ్‌లో పాల్గొంటారని సినీ వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరిలో కొన్ని రోజులు ఆయన కేటాయిస్తారని పేర్కొన్నాయి. గతేడాది జూన్‌లో రిలీజైన కల్కి ₹1100 కోట్ల కలెక్షన్లు సాధించింది. మరోవైపు స్పిరిట్, ఫౌజీ చిత్రాల్లోనూ ప్రభాస్ నటిస్తున్నారు. న్యూఇయర్ సందర్భంగా స్పిరిట్ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రావచ్చని టాక్.
News December 31, 2025
‘గల్వాన్’ గొడవ.. అసలు అప్పుడేమైంది?

<<18714683>>గల్వాన్ లోయ<<>>లో 2020 జూన్ 15న ఇండియా, చైనా సైనికుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. మన భూభాగంలోకి చొచ్చుకొచ్చేందుకు యత్నించిన చైనా ఆర్మీకి భారత సైనికులు అడ్డునిలిచారు. రాడ్లు, రాళ్లతో 6 గంటలపాటు దాడి చేసుకోవడంతో 20మంది భారత జవాన్లు మరణించారు. చైనా వైపు 40 మందికి పైగా చనిపోయారు. ఈ ఘటనలో TGకి చెందిన కల్నల్ సంతోష్ బాబు వీరమరణం పొందారు. ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’లో సంతోష్‌బాబు పాత్రనే <<18686152>>సల్మాన్<<>> పోషిస్తున్నారు.
News December 31, 2025
Khaleda Zia: ఇండియాలో పుట్టి.. ఇండియా వ్యతిరేకిగా మారి..

బంగ్లాదేశ్ Ex PM <<18709090>>ఖలీదా జియా<<>>(80) నిన్న మరణించిన విషయం తెలిసిందే. బ్రిటిష్ ఇండియాలోని బెంగాల్‌లో పుట్టిన ఆమె భారత వ్యతిరేకిగా ముద్రపడ్డారు. PMగా పదేళ్లలో గంగా జలాలు, వలసదారులు వంటి ఎన్నో అంశాల్లో మనతో ఘర్షణలకు దిగారు. భారత వ్యతిరేక శక్తులకు బంగ్లాలో ఆశ్రయమిచ్చారు. పాక్, చైనాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో నాడు రాజకీయంగా తీవ్ర ఉద్రిక్తతలు ఉండేవి. హసీనా హయాంలో పరిస్థితి మారింది.


