News October 4, 2024

టాస్ ఓడిన టీమ్ ఇండియా

image

వుమెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమ్ ఇండియా టాస్ ఓడింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్: షఫాలీ, స్మృతి, హర్మన్‌, రోడ్రిగ్స్, రిచా, దీప్తి, వస్త్రాకర్, శ్రేయాంక పాటిల్, అరుంధతి, రేణుకా సింగ్, ఆశా.
కివీస్: బేట్స్, ప్లిమ్మర్, అమేలియా కెర్, డివైన్(సి), హాలిడే, గ్రీన్, ఇసాబెల్లా, జెస్ కెర్, మెయిర్, ఈడెన్ కార్సన్, లీ తహుహు.

Similar News

News September 15, 2025

వ్యాయామం, రన్నింగ్.. మితంగా చేస్తేనే మేలు!

image

రోజూ వ్యాయామం చేయడం మంచిదే. కానీ అతిగా చేయడం ఆరోగ్యానికి ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘వారానికి 30-50kms రన్నింగ్ చేయొచ్చు. అలాగే రోజుకు 7000-10,000 అడుగుల నడక ఉత్తమం. ఎక్కువ దూరం పరిగెత్తడం వల్ల గుండె, కీళ్ల సమస్యలు పెరిగే ఛాన్స్ ఉంది. వారానికి రెండు నుంచి మూడు సార్లు స్ట్రెంత్ ట్రైనింగ్ సరిపోతుంది. మితమైన వ్యాయామం, సరైన విశ్రాంతి ముఖ్యం’ అని సూచిస్తున్నారు. SHARE IT

News September 15, 2025

రేపు రాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్!

image

TG: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు మరోసారి నిలిచిపోనున్నాయి. మంగళవారం రాత్రి నుంచి సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రైవేట్ నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. రూ.1,400 కోట్ల బకాయిల చెల్లింపుపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై డిప్యూటీ సీఎం, ఆరోగ్యశాఖ మంత్రికి లేఖలు ఇచ్చింది.

News September 15, 2025

సిరాజ్‌కు ICC ప్లేయర్ ఆఫ్ ది మంత్‌ అవార్డు

image

భారత స్టార్ బౌలర్ మహమ్మద్ సిరాజ్‌కు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ (ఆగస్టు) అవార్డు దక్కింది. ఇటీవల ఇంగ్లండ్‌తో చివరి టెస్టులో సిరాజ్ అద్భుతమైన స్పెల్ వేశారు. 9 వికెట్లు తీసి సిరీస్ 2-2తో సమం కావడంలో కీలకపాత్ర పోషించారు. ఆ సిరీస్‌లో ప్రతి మ్యాచ్ ఆడిన సిరాజ్.. మొత్తం 23 వికెట్లు పడగొట్టారు.