News October 25, 2024
టీమ్ ఇండియాకు సరికొత్త ‘వాల్’ కావాలి

టీమ్ ఇండియాలో టాలెంటెడ్ ఆటగాళ్లకు కొదువ లేకపోయినా టెస్టుల్లో నిలదొక్కుకొని ఆడే ప్లేయర్ కొరత కొంత కాలంగా వేధిస్తోంది. ‘ది వాల్’ ద్రవిడ్ తర్వాత ఆయన స్థానాన్ని కొంత మేర పుజారా భర్తీ చేశారు. అయితే ఆయన ఫామ్ లేమితో జట్టుకు దూరమవ్వగా ఇప్పుడు ఆ ప్లేస్లో కొరత ఉందని క్రీడా నిపుణులు చెబుతున్నారు. మరి ఇప్పటికైనా జట్టు యాజమాన్యం ఆ స్థానాన్ని భర్తీ చేసే ప్లేయర్ను అన్వేషిస్తుందా లేదా వేచి చూడాలి.
Similar News
News November 27, 2025
తిరుమల వెళ్లినప్పుడు దీన్ని తప్పక చూడండి

తిరుమల శ్రీవారి ఆలయంలో హుండీకి ఎదురుగా తాళ్లపాక అర ఉంటుంది. దీన్నే సంకీర్తనా భాండాగారం అంటారు. 15వ శతాబ్దంలో తాళ్లపాక అన్నమాచార్యులు రోజుకో కీర్తన రచించేవారట. ఆయనతో పాటు ఆయన వంశీకులు రచించిన అసంఖ్యాకమైన సంకీర్తనలన్నీ ఈ అరలోనే భద్రపరిచారు. ఈ అర బయట ఉన్న శిలా ఫలకంపై అన్నమయ్య ఉన్న చిత్రం ఉంటుంది. ఈసారి తిరుమల వెళ్లినప్పుడు దీన్ని అస్సలు మిస్సవ్వకండి.<<-se>>#VINAROBHAGYAMU<<>>
News November 27, 2025
ఫోన్ ట్యాపింగ్ కేసులో KCR మాజీ ఓఎస్డీ విచారణ

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ CM KCR వద్ద OSDగా పనిచేసిన రాజశేఖర్ రెడ్డిని జూబ్లీహిల్స్ PSలో సిట్ విచారిస్తోంది. దీంతో ఆయన ఎలాంటి సమాచారం ఇస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. INC ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై దృష్టి సారించింది. ఈ కేసులో మాజీ IPS ప్రభాకర్ రావును సుదీర్ఘంగా విచారించింది. పలువురు రాజకీయ ప్రముఖుల వాంగ్మూలాలను సిట్ రికార్డ్ చేసింది.
News November 27, 2025
రామ్ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ రివ్యూ&రేటింగ్

హీరో కష్టాన్ని తీర్చేందుకు అభిమాని ఏం త్యాగం చేశాడనేదే ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ స్టోరీ. ఫ్యాన్ బయోపిక్గా తెరకెక్కించిన ఈ చిత్రంలో హీరో పాత్రలో ఉపేంద్ర, అభిమాని రోల్లో రామ్ అద్భుతంగా నటించారు. రామ్, భాగ్యశ్రీ బోర్సే కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. సాంగ్స్, ఎమోషనల్ సీన్లు ప్లస్ కాగా లెన్తీ, ఊహించే సీన్లు, స్లో నరేషన్ మైనస్.
రేటింగ్- 2.75/5


