News August 22, 2025
క్రికెట్‌కు టీమ్ఇండియా ప్లేయర్ సుల్తానా వీడ్కోలు

భారత మహిళా క్రికెటర్ గౌహర్ సుల్తానా క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. అన్ని రకాల ఫార్మాట్ల నుంచి తక్షణమే తప్పుకుంటున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. కాగా 37 ఏళ్ల సుల్తానా 2008లో పాకిస్థాన్‌తో వన్డేలో అంతర్జాతీయ అరంగేట్రం చేశారు. ఇప్పటివరకు 50 వన్డేలాడి 66 వికెట్లు, 37 టీ20లు ఆడి 29 వికెట్లు తీశారు. చివరిసారిగా ఆమె 2014లో పాకిస్థాన్‌తో జరిగిన టీ20లో ఆడారు.
Similar News
News March 18, 2026
‘ధురంధర్-2’ పబ్లిక్ టాక్

‘ధురంధర్-2’ ప్రీమియర్ షోలు చూసిన ప్రేక్షకులు Xలో రివ్యూలు ఇస్తున్నారు. ఫిల్మ్ మేకింగ్ అదిరిపోయిందని, రణ్‌వీర్ సింగ్ నటన, ఇంటర్వెల్ అద్భుతం అని ప్రశంసిస్తున్నారు. డైరెక్టర్ ఆదిత్య ధార్ 4 గంటల సినిమాను ఎక్కడా బోర్ కొట్టకుండా తెరకెక్కించారని చెబుతున్నారు. హింసాత్మక సీన్లు ఎక్కువగా ఉన్నా దేశభక్తి సినిమా కాబట్టి జస్టిఫై చేసేలా ఉన్నాయని కామెంట్స్ చేస్తున్నారు.
*Way2News ఫుల్ రివ్యూ రేపు ఉదయం..
News March 18, 2026
మహిళా ఓటర్ల ఫేవర్ ఎవరికో? (1/2)

నాలుగు రాష్ట్రాలు, ఓ యూటీ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమైన వేళ మరోసారి మహిళా ఓటర్ల డామినేషన్ చర్చనీయాంశమైంది. 2025 బిహార్, ఢిల్లీ ఎన్నికల్లో ఉమెన్ ఫ్యాక్టర్ వర్కౌట్ అయింది. ఈ నేపథ్యంలో ఈసారి కూడా మహిళలను ఆకట్టుకునేందుకు పార్టీలు ప్లాన్ చేస్తున్నాయి. అస్సాంలో 1.25Cr (49.97%), బెంగాల్‌లో 3.16Cr (49%), TNలో 2.89Cr (51.07%), కేరళంలో 1.38Cr (51%), పుదుచ్చేరి 5.3లక్షలు (53%) మహిళా ఓటర్లు ఉన్నారు.
News March 18, 2026
మహిళా ఓటర్ల ఫేవర్ ఎవరికో? (2/2)

మహిళలు డిసైడింగ్ ఫ్యాక్టర్‌గా ఉన్నారు కాబట్టే WBలో మమతా సర్కార్ ఇచ్చిన లక్ష్మిర్ భండార్ స్కీమ్‌కు కౌంటర్‌గా ₹5700Cr ప్యాకేజ్, అన్నపూర్ణ యోజనతో నెలకు ₹3వేలు ఇస్తామని BJP ప్రకటించింది. TNలో నెలకు ₹2500, ఆడశిశువులకు గోల్డ్ రింగ్ వంటి హామీలొచ్చాయి. కేరళంలో పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. అస్సాంలో మహిళా సంఘాలే తమ డిమాండ్స్‌పై మ్యానిఫెస్టో ప్రకటించాయి. మరి మహిళలు గేమ్ ఛేంజర్‌గా మారతారో చూడాలి.


