News October 30, 2024
ఆఖరి టెస్టు కోసం టీమ్ ఇండియా కసరత్తు

న్యూజిలాండ్‌తో జరగబోయే చివరి టెస్టు కోసం టీమ్ ఇండియా తీవ్ర కసరత్తులు చేస్తోంది. భారత ఆటగాళ్లు నెట్స్‌లో తీవ్రంగా చెమటోడ్చుతున్నారు. కెప్టెన్ రోహిత్‌తోపాటు కోహ్లీ, బుమ్రా, జడేజా, ఆకాశ్ దీప్ తదితర ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు. కాగా ఎల్లుండి ముంబైలోని వాంఖడే స్టేడియంలో మూడో టెస్టు ప్రారంభం కానుంది. రెండో టెస్టులో ఆడిన జట్టుతోనే రోహిత్ సేన ఈ మ్యాచ్‌లోనూ బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.
Similar News
News January 13, 2026
మెదక్: ST రిజర్వేషన్.. BC మహిళ సర్పంచ్!

సర్పంచ్ ఎన్నికలలో ఎస్టీలకు, బీసీలు అన్యాయం చేశారని బంజారా సేవాలాల్ సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ ఆరోపించారు. టేక్మాల్ మండలం వెంకటాపూర్ గ్రామానికి సర్పంచ్ ఎస్టీ రిజర్వేషన్ వచ్చింది. ఎరుకల రాంబాయి అనే బీసీ మహిళ ఎస్టీ కులధ్రువీకరణ పత్రంతో ఎన్నికలలో పోటీ చేసి సర్పంచ్‌గా గెలుపొందింది. సర్పంచ్‌పై సమగ్ర విచారణ జరిపాలని తహశీల్దార్ తులసిరామ్‌కు వారు వినతి పత్రాన్ని సమర్పించారు.
News January 13, 2026
ఒకటి, రెండు రోజుల్లో షెడ్యూల్!

TG: రాష్ట్రంలో పండగ వేళ ఎన్నికల సందడి మొదలుకానుంది. మున్సిపల్ ఓటర్ల ఫైనల్ లిస్ట్ విడుదల చేయడంతో షెడ్యూల్ రిలీజ్‌కు SEC సిద్ధమైంది. 1,2 రోజుల్లో షెడ్యూల్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. FEB రెండో వారంలో ఎన్నికలు జరిగే అవకాశముంది. ఈ నెల 20 నాటికి రిజర్వేషన్లను ఖరారు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం SC, ST, డెడికేషన్ కమిషన్ ఆధారంగా BC రిజర్వేషన్లను ప్రకటించనుంది.
News January 13, 2026
డయాబెటిస్ రాకుండా ఉండాలంటే..!

ఆరోగ్యకరమైన జీవనశైలి వల్ల సాధ్యమైనంత మేరకు <<18842236>>డయాబెటిస్<<>>ను దూరం పెట్టొచ్చని వైద్యులు చెబుతున్నారు. ‘చక్కెర, ప్రాసెస్ చేసిన ఆహారాలు తగ్గించి పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు తీసుకోవాలి. వ్యాయామం చేయడం, ధూమపానం మానేయడం, తగినంత నిద్రపోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం వంటివి చాలా ముఖ్యం’ అని సూచిస్తున్నారు. మరోవైపు మీ శరీర బరువు అదుపులో ఉంచుకుంటే మధుమేహం వచ్చే అవకాశం 60% వరకు తగ్గుతుందని చెబుతున్నారు.


