News December 24, 2024
టీమ్ ఇండియా సూపర్ విక్టరీ

వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో భారత మహిళల జట్టు విజయం సాధించింది. 115 పరుగుల తేడాతో ఆ జట్టును చిత్తు చేసింది. 359 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన విండీస్ 243 రన్స్‌కు ఆలౌటైంది. ఆ జట్టు కెప్టెన్ హేలీ మాథ్యూస్ (106) అద్భుత శతకం బాదారు. కానీ మిగతా బ్యాటర్లు ఆమెకు సహకారం అందించలేకపోయారు. భారత బౌలర్లలో ప్రియా మిశ్రా 3, ప్రతిక రావల్, సాధు, దీప్తి శర్మ తలో రెండు వికెట్లు పడగొట్టారు.
Similar News
News October 29, 2025
తుఫాన్ నష్టంపై వేగంగా అంచనాలు: లోకేశ్

AP: ‘మొంథా’ ప్రభావంతో జరిగిన నష్టంపై వేగంగా ప్రాథమిక అంచనాలు రూపొందించాలని మంత్రి లోకేశ్ అధికారులను ఆదేశించారు. కోనసీమ, కృష్ణా, బాపట్ల, ఎన్టీఆర్, ప్రకాశం జిల్లాల్లో విద్యుత్ స్తంభాలు విరిగి, చెట్లు కూలి కరెంటు నిలిచిపోయిందని చెప్పారు. విద్యుత్ సరఫరా జరిగేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. క్షేత్రస్థాయిలో పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు అందుబాటులో ఉండి బాధితులకు సహాయాన్ని అందించాలని సూచించారు.
News October 29, 2025
నేను చిరు మూవీలో నటించట్లేదు: మాళవిక

చిరంజీవి, బాబీ కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమాలో నటిస్తున్నారనే ప్రచారాన్ని హీరోయిన్ మాళవికా మోహనన్ ఖండించారు. ‘ఏదో ఒకరోజు చిరంజీవి సార్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవాలని నాకు ఉంది. అయితే మెగా158లో నటిస్తున్నానని జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం’ అని క్లారిటీ ఇచ్చారు. కాగా ప్రభాస్ ‘ది రాజాసాబ్’లో ఈ బ్యూటీ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ 2026 జనవరి 9న థియేటర్లలో రిలీజ్ కానుంది.
News October 29, 2025
అజహరుద్దీన్‌కు మంత్రి పదవి

ఎల్లుండి తెలంగాణ మంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత, టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. నిన్న అజహరుద్దీన్, ఆయన కుమారుడు అసదుద్దీన్‌తో భేటీలో సీఎం రేవంత్ మంత్రి పదవిని ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మంత్రివర్గంలో మైనారిటీలు లేకపోవడంతో అవకాశం ఇచ్చినట్లు సమాచారం. MLCగా అజహరుద్దీన్ పేరును ప్రభుత్వం ఇప్పటికే గవర్నర్ వద్దకు పంపింది. దానికి ఆమోదం తెలపాల్సి ఉంది.


