News August 4, 2024

టీమ్ ఇండియాలో ప్రయోగాలు కొనసాగిస్తాం: బౌలింగ్ కోచ్

image

టీమ్ ఇండియా కోచ్‌గా గంభీర్ తన మొదటి సిరీస్‌లోనే ప్రయోగాలకు తెర తీశారు. గిల్, సూర్య, రింకూ వంటి బ్యాటర్లతో బౌలింగ్ చేయించారు. ఇకపైనా ప్రయోగాలు కొనసాగుతాయని భారత బౌలింగ్ కోచ్ బహుతులే వెల్లడించారు. ‘మన బ్యాటర్లలో బౌలింగ్ సత్తా కూడా ఉంది. కానీ దానిపై దృష్టి పెట్టడం లేదంతే. టాప్ ఆర్డర్ బ్యాటర్లు బౌలింగ్ చేయడం జట్టుకు అవసరం. మున్ముందూ వారితో బౌలింగ్ చేయిస్తాం’ అని వెల్లడించారు.

Similar News

News January 21, 2025

ట్రంప్ షాక్: బర్త్ రైట్ సిటిజన్‌షిప్ రద్దు

image

డొనాల్డ్ ట్రంప్ అనుకున్నదే చేశారు. అమెరికాలో జన్మత: లభించే పౌరసత్వాన్ని రద్దు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేశారు. రాజ్యాంగంలోని 14వ ఆర్టికల్‌ను సవరించి వందేళ్లుగా కొనసాగుతున్న విధానాన్ని రద్దు చేశారు. ఇకపై చట్టబద్ధంగా USలో ఉంటున్న వారు జన్మనిచ్చే పిల్లలకే ఈ హక్కు లభిస్తుంది. అక్రమ వలసదారుల పిల్లలకు వర్తించదు. చాలామంది భారతీయులు విజిటింగ్‌కు వెళ్లి అక్కడ పిల్లలకు జన్మనిచ్చే సంగతి తెలిసిందే.

News January 21, 2025

తండ్రి కాబోతున్న టాలీవుడ్ హీరో

image

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తండ్రి కాబోతున్నారు. తన భార్య బేబీ బంప్‌తో ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్న ఆయన ‘మా ప్రేమ 2 అడుగుల మేర పెరుగుతోంది’ అంటూ ట్వీట్ చేశారు. దీంతో అందరూ కిరణ్‌కు కంగ్రాట్స్ చెబుతున్నారు. కాగా తాను ప్రేమించిన హీరోయిన్ రహస్య గోరక్‌ను కిరణ్ గత ఆగస్టులో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

News January 21, 2025

Stock Markets: రియాల్టి షేర్లపై సెల్లింగ్ ప్రెజర్

image

గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలే అందడంతో దేశీయ స్టాక్‌మార్కెట్లు ఫ్లాటుగా ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 76942 (-130), నిఫ్టీ 23,346 (5) వద్ద కొనసాగుతున్నాయి. BRICS దేశాలపై 100% టారిఫ్ విధిస్తానని ట్రంప్ చెప్పడం నెగటివ్ సెంటిమెంటుకు దారితీసింది. మీడియా, మెటల్, ఫార్మా, హెల్త్‌కేర్, O&G షేర్లకు డిమాండ్ కనిపిస్తోంది. రియాల్టి షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ ఉంది. BPCL, APOLLOHOSP టాప్ గెయినర్స్.