News March 4, 2025

టీమ్ ఇండియా ఆందోళనంతా అతడి గురించే: DK

image

టీమ్ ఇండియాకు ఆస్ట్రేలియా జట్టుతో భయం లేదు కానీ మానసికంగా ట్రావిస్ హెడ్ అనే అడ్డంకి ఆటగాళ్ల మైండ్‌లో ఉంటుందని మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ అంచనా వేశారు. ‘గతంలో నాకౌట్ గేమ్స్‌లో న్యూజిలాండ్‌తో ఆడుతున్నప్పుడు ఇలాంటి భావన ఉండేది. కానీ ఇప్పుడు ఆస్ట్రేలియా అద్భుతంగా ఆడుతోంది. హెడ్ వికెట్ తీస్తే భారత్ ఊపిరి పీల్చుకోవచ్చు’ అని DK పేర్కొన్నారు.

Similar News

News November 21, 2025

వరంగల్‌: రేపు జాబ్ మేళా

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు ఈ నెల 22వ తేదీన నిర్వహించనున్న జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి బి. సాత్విక కోరారు. ములుగు రోడ్డులోని ప్రభుత్వ ఐటీఐ క్యాంపస్ వద్ద ఉన్న జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో ఈ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు చెప్పారు. 18 నుంచి 34 సంవత్సరాల మధ్య వయసు ఉండి, ఎస్సెస్సీ, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన యువతీ యువకులు ఈ మేళాకు అర్హులన్నారు.

News November 21, 2025

వేరుశనగలో తుప్పు/ కుంకుమ తెగులు – నివారణ

image

పెరిగిన చలి తీవ్రత, తేమ వాతావరణంతో వేరుశనగలో తుప్పు లేదా కుంకుమ తెగులు వ్యాపిస్తుంది. ఈ తెగులు సోకిన మొక్క ఆకుల అడుగు భాగంలో ఇటుక రంగు/ఎరుపు రంగు చిన్న చిన్న పొక్కులు ఏర్పడి, ఆకుల పైభాగంలో పసుపు మచ్చలు కనిపిస్తాయి. ఉద్ధృతి ఎక్కువైతే ఈ పొక్కులు మొక్క అన్ని భాగాలపై కనిపిస్తాయి. తుప్పు తెగులు కట్టడికి 200 లీటర్ల నీటిలో క్లోరోథలోనిల్ 400 గ్రా. లేదా మాంకోజెబ్ 400 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి.

News November 21, 2025

పరమ పావన మాసం ‘మార్గశిరం’

image

మార్గశిర మాసం విష్ణువుకు అతి ప్రీతికరమైనది. ఈ మాసంలోనే దత్తాత్రేయుడు, అన్నపూర్ణాదేవి, కాలభైరవుడు వంటి దైవ స్వరూపులు అవతరించారు. పరాశరుడు, రమణ మహర్షి వంటి మహనీయులు జన్మించారు. భగవద్గీత లోకానికి అందిన పవిత్రమైన రోజు మార్గశిర శుద్ధ ఏకాదశి. ఆధ్యాత్మికంగా ముఖ్యమైన ధనుర్మాసం ప్రారంభం, హనుమద్వ్రతం, మత్స్య ద్వాదశి వంటి పర్వదినాలు ఈ మాసంలోనే ఉన్నాయి. అందుకే ఈ మాసం ఎంతో విశేషమైందని పండితులు చెబుతారు.